Hyundai Alcazar Facelift: అడ్వాన్స్ డ్ సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో హ్యుందాయ్ నుంచి స‌రికొత్త కారు, కేవ‌లం రూ. 25వేలు కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవ‌చ్చు

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ (Alcazar Facelift) లిఫ్ట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. హ్యండాయ్ ఫ్లాగ్ షిప్ త్రీ రో ఎస్‌యూవీ కారు ఆవిష్కరణ తేదీ ఖరారు కావడంతో ప్రీ బుకింగ్స్ (Pre Bookings) ప్రారంభం అయ్యాయి.

Hyundai Alcazar Facelift

New Delhi, AUG 22: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ (Alcazar Facelift) లిఫ్ట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. హ్యండాయ్ ఫ్లాగ్ షిప్ త్రీ రో ఎస్‌యూవీ కారు ఆవిష్కరణ తేదీ ఖరారు కావడంతో ప్రీ బుకింగ్స్ (Pre Bookings) ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా గానీ, హ్యుండాయ్ డీలర్ల వద్ద గానీ ప్రీ బుకింగ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన హ్యుండాయ్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ కారు (Hyundai Alcazar Facelift) ఆవిష్కరిస్తారు. గత జనవరిలో న్యూ క్రెటా ఆవిష్కరించిన తర్వాత అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణ ప్రధానం కానున్నది.

 

2022లో తొలి మూడు వరుసల ఎస్‌యూవీ అల్కాజర్‌ను హ్యుండాయ్ తొలిసారి భారత్ మార్కెట్లోకి తెచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకూ 75 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. సిక్స్ సీట్, సెవెన్ సీట్ లే ఔట్లతో మార్కెట్లోకి వచ్చింది హ్యుండాయ్ అల్కాజర్. మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీతోపాటు మరో మూడు యుటిలిటీ వాహనాలకు గట్టి పోటీ ఇస్తోంది హ్యుండాయ్ అల్కాజర్. హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు నాలుగు వేరియంట్లలో వస్తోంది. ఎగ్జిక్యూటివ్, ప్రిస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లలో వస్తోంది. నాన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ లోనూ అందుబాటులో ఉంటుంది. రోబస్టర్ ఎమరాల్డ్ మ్యాట్టె కలర్ థీమ్‌లోనూ లభిస్తుందీ కారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

New Pandemic Infection Of H5N1 Virus: ముంచుకొస్తున్న మరో మహమ్మారి, పలుదేశాల్లో పెరగుతున్న కొత్త వైరస్ కేసులు, కరోనా కంటే డేంజరస్ అంటున్న నిపుణులు

Royal Enfield Scram 440: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి మరో కొత్త ఆవిష్కరణ, రూ. 2.08 లక్షలకే స్క్రామ్‌ 440ని మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీ

Los Angeles Wildfires: వీడియోలు ఇవిగో, లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు, గంటల వ్యవధిలోనే 9 వేల 400 ఎకరాలు కాలి బూడిద, దాదాపు 50వేల మందిని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు

Minister Seethakka: కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు కులగణనలో సర్వేలో పాల్గొనలేదు.. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి సీతక్క

Share Now