ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదిగో..
ఇక చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్ గెలుచుకున్నది.తాజాగా 2025 ట్రోఫీ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇక చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్ గెలుచుకున్నది.తాజాగా 2025 ట్రోఫీ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్ లో జరగనున్నయి.
తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్ తో న్యూజిలాండ్ కరాచీలో తలపడనున్నది. పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో రావల్పిండిలో ఆడుతుంది.ఇక భారత్-పాకిస్థాన్ మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 23 (ఆదివారం) దుబాయ్ లో జరుగనున్నది. దాయాది దేశంతో ఆడే మూడు మ్యాచ్ లు దుబాయిలోనే జరుగనున్నాయి.
ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఇందులో గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.మొత్తం 15 మ్యాచులు జరుగనున్నాయి.ఈ టోర్నీ 19 రోజుల పాటు కొనసాగుతుంది. పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లకు రావల్పిండి, లాహోర్, కరాచీ ఆతిథ్యం ఇస్తాయి.
ICC Champions Trophy 2025 Full Schedule Announced
పాకిస్థాన్‌లోని ఒక్కో స్టేడియంలో మూడు గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 4, మార్చి 5 తేదీల్లో రెండు సెమీఫైనల్స్ ఉంటాయి. రెండు సెమీ ఫైనల్స్ రిజర్వ్ డే కేటాయించారు. మార్చి 9న జరిగే ఫైనల్స్‌కు రిజర్వ్ డే ఉంటుంది. తొలి సెమీ ఫైనల్ (భారత్ క్వాలిఫై అయితే) యూఏఈలో జరుగుతుంది. లేకపోతే పాక్‌లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. భారత్ ఫైనల్‌కు చేరితే మాత్రం దుబాయిలో జరుగుతుంది.
భారత జట్టును పాక్‌కు పంపేందుకు కేంద్రం నిరాకరించడంతో బీసీసీఐ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఐసీసీ పాక్‌ను ఒప్పించింది. అయితే, పాక్ సైతం షరతులు విధించింది. 2024-27 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌ని సైతం హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాల్సిందేనని పట్టుబట్టగా.. అందుకు ఐసీసీ, బీసీసీఐ అంగీకారం తెలిపాయి. దాంతో ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్లు తటస్థ వేదికల్లో తలపడనున్నాయి. టీమిండియా మ్యాచ్ ల విషయానికి వస్తే..తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత 23న పాకిస్థాన్.. మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.