ICC Champions Trophy 2025 (Photo credit: X @therealpcb)

New Delhi, NOV 30: ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్‌ ట్రోఫీని (Champions Trophy) హైబ్రిడ్‌ మోడల్‌లో ( Hybrid Model) నిర్వహించేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ.. ఐసీసీకి షరతులు విధించినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేందుకు హైబ్రిడ్ మోడల్ మాత్రమే ఆచరణీయమైన పరిష్కారమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తెలిపింది. ట్రోఫీ కోసం జట్టును పాక్‌కు పంపేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైబ్రీడ్‌ మోడల్‌ను ప్రతిపాదించింది. 29న వర్చువల్‌గా జరిగిన సమావేశంలో టోర్నీపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ క్రమంలోనే పాక్‌ రాజీకి వచ్చినట్లు తెలుస్తున్నది. నవంబర్ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ (Pakistan) పొందింది.

ICC Champions Trophy 2025: టీమిండియాను పాకిస్తాన్‌ పంపే ప్రసక్తి లేదు, మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎమ్‌ఈఏ, ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని తెలిపిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా 

ఈ సంవత్సరం ప్రారంభంలో ఈవెంట్‌కు సన్నాహకంగా పీసీబీ మూడు స్టేడియాలను పునరుద్ధరించడం మొదలుపెట్టింది. భారత ప్రభుత్వం తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు నిరాకరించింది. అయితే, గ్రూప్‌ దశలు, సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌తో సహా భారత క్రికెట్ జట్టు పాల్గొన్న అన్ని మ్యాచ్‌లు (అర్హత సాధిస్తే) దుబాయిలో జరుగుతాయి. గ్రూప్ దశలోనే భారత్‌ నిష్క్రమిస్తే లాహోర్‌లో సెమీ-ఫైనల్, ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చే హక్కును పాకిస్తాన్ దక్కుననున్నాయి. ఇక భవిష్యత్తులో ఐసీసీ ఈవెంట్‌లకు భారత్ ఆతిథ్యం ఇస్తే.. పాకిస్తాన్ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో ఆడాల్సిందేనని పీసీబీ స్పష్టం చేసింది. భద్రతా కారణాలతో భారత్‌ జట్టును పంపేందుకు నిరాకరించింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఐసీసీ హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రతిపాదించింది.

Royal Challengers Bengaluru Team in IPL 2025: కోహ్లీ ఉన్నా టైటిల్ కొట్టలేదు, ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ పూర్తి జట్టు ఇదిగో, టైటిల్ రేసులో ఇప్పుడైనా నిలబడుతుందా.. 

శుక్రవారం 12 మంది సభ్యులు, ముగ్గురు అసోసియేట్ సభ్యులు, ఐసీసీ చైర్మన్‌, ప్రతినిధులతో కూడిన ఐసీసీ బోర్డు సమావేశం టోర్నీపై ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. అయితే, దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య టోర్నమెంట్ సజావుగా సాగేందుకు దుబాయి టీమిండియా మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నది. దుబాయిలో జరిగే మ్యాచ్‌ల ద్వారా వచ్చే గేట్ రాబడితో సహా ఆర్థిక ఏర్పాట్లు, పాకిస్తాన్‌తో ఆదాయ-భాగస్వామ్యాన్ని మినహాయించి, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్‌కు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే, టోర్నీ షెడ్యూల్‌పై ఇప్పటికీ ఐసీసీ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. మొదట మ్యాచ్ తేదీలను మాత్రమే ప్రకటించి, ఆ తర్వాత మిగతా మ్యాచ్‌ తేదీలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ నిర్వహించేందుకు పాక్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. నేడో, రేపో షెడ్యూల్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.