China Rapid Test Kits: చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడవద్దు, వెంటనే చైనాకు వాటిని తిరిగి పంపండి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్

చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను (China Rapid Test Kits) ఇక నుంచీ వాడరాదని రాష్ట్రాలను ఐసీఎంఆర్‌ ( ICMR) ఆదేశించింది. చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌లో నాణ్యత లోపించిందని ప్రకటించిన ఐసీఎంఆర్‌ ఆయా కిట్లను చైనాకు (China) వెనక్కు పంపించాలని రాష్ట్రాలను కోరింది. ర్యాపిడ్ టెస్టుల కొనుగోళ్లు నిలిపివేయాలని చెప్పిన ఐసీఎమ్ఆర్.. ఇప్పటికే డెలివరీ తీసుకున్న వాటిని కూడా చైనా కంపెనీలకు వెనక్కు ఇచ్చేయాలని రాష్ట్రాలకు సూచించింది.

Rapid Testing Kits For COVID-19 (Photo Credits: PTI)

New Delhi, April 27: ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల కచ్చితత్వంపై రాష్ట్రాలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) కీలక సూచనలు జారీ చేసింది. చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను (China Rapid Test Kits) ఇక నుంచీ వాడరాదని రాష్ట్రాలను ఐసీఎంఆర్‌ ( ICMR) ఆదేశించింది. చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌లో నాణ్యత లోపించిందని ప్రకటించిన ఐసీఎంఆర్‌ ఆయా కిట్లను చైనాకు (China) వెనక్కు పంపించాలని రాష్ట్రాలను కోరింది. ర్యాపిడ్ టెస్టుల కొనుగోళ్లు నిలిపివేయాలని చెప్పిన ఐసీఎమ్ఆర్.. ఇప్పటికే డెలివరీ తీసుకున్న వాటిని కూడా చైనా కంపెనీలకు వెనక్కు ఇచ్చేయాలని రాష్ట్రాలకు సూచించింది.

కాగా టెస్టుల కచ్చితత్వంపై వచ్చిన ఫిర్యాదులను అధ్యయనం చేసిన ఐసీఎమ్ఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫలితాల్లో భారీ తేడాలు ఉన్నట్టు వెల్లడవడంతో ర్యాపిడ్ టెస్టులకు పక్కన పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. చైనా కంపెనీలు తొలుత ఇచ్చిన హామీకి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయని అంగీకరించింది. లాక్‌డౌన్‌ కొనసాగించాలా, వద్దా అనేదానిపై మే 3 తర్వాత తుది నిర్ణయం, రాష్ట్రాల సీఎంలతో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

కాగా.. చైనాకు చెందిన వాండ్‌ఫోం బయోటెక్, లివ్‌జాన్ డయాగ్నస్టిక్ కంపెనీల (Zhuhai Livzon Diagnostics) నుంచి రాష్ట్రాలు ఈ కిట్లను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. మాయమైన చైనా జర్నలిస్ట్ మళ్లీ ప్రత్యక్షం, వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించిన తరువాత మాయం, క్వారంటైన్‌లోకి తీసుకువెళ్లారని వెల్లడించిన లీ జహువా

ఇక దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 1396 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. వైరస్‌ మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 872 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 6185 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. మూడు రాష్ట్రాల్లోనే 68 శాతం పాజిటివ్‌ కేసులున్నాయని పేర్కొంది. కరోనా వైరస్‌ నుంచి రికవరీ రేటు 22.17 శాతం పెరగడం ఊరట కలిగిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆర్బీఐ కీలక నిర్ణయం, మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, NBFCsలకు మారటోరియం విస్తరణపై బ్యాంకులదే తుది నిర్ణయం

ఇక దేశవ్యాప్తంగా 20,835 కేసులు చురుగ్గా ఉన్నాయని చెప్పారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రైతులకు కొన్ని సడలింపులు ఇచ్చామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ ఉపాథి హామీ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif