India-China Dispute Row: సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే చావు దెబ్బ తీస్తాం, సవాళ్లను ఎదుర్కునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని తెలిపిన భారత ఆర్మీ
భారత్-చైనాల మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదంపై (India-China Dispute Row:) ఇండియన్ ఆర్మీ డ్రాగన్ కంట్రీకీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లడఖ్ సెక్టార్‌లో చైనా దూకుడు చర్యలకు పాల్పడితే భారత్ ధీటుగా స్పందించేందుకు రెడీగా ఉందని భారత సైన్యం స్పష్టం (Army Commander's warning on LAC situation) చేసింది.
New Delhi, Feb 7: భారత్-చైనాల మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదంపై (India-China Dispute Row:) ఇండియన్ ఆర్మీ డ్రాగన్ కంట్రీకీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లడఖ్ సెక్టార్‌లో చైనా దూకుడు చర్యలకు పాల్పడితే భారత్ ధీటుగా స్పందించేందుకు రెడీగా ఉందని భారత సైన్యం స్పష్టం (Army Commander's warning on LAC situation) చేసింది.వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పెట్రోలింగ్‌తో పాటు పలు చర్యలు చేపడుతున్నామని దేశ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్మీ పేర్కొంది.
ఎల్ఏసీ వద్ద యథాతథ స్ధితిని మార్చేందుకు చైనా దళాలకు భారత్ సైన్యం కళ్లెం వేసిందని, ధీటుగా స్పందించి అడ్డుకట్ట వేసిందని ఆర్మీ నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.ఎల్ఏసీ వద్ద చైనా ఎలాంటి దుందుడుకు చర్యలకు తెగబడినా (Any aggression attempts) త్రివిధ దళాల మధ్య సమన్వయంతో మన సాయుధ బలగాలు డ్రాగన్ చర్యలను దీటుగా తిప్పికొడతాయని చెప్పారు. ఎల్ఏసీపై నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు దౌత్య స్ధాయిలో, అధికారుల స్ధాయిలో చేపట్టాల్సిన చర్యలూ కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎల్ఏసీలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లు, ముప్పును పసిగడుతూ ఎదుర్కొనేందుకు నార్తన్ కమాండ్ సంసిద్దంగా ఉందని లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది తెలిపారు. జాతి ప్రజాస్వామిక పునాదులు, సంప్రదాయాలను కాపాడుతూ దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాము నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో పాటు అన్ని పరిణామాలను పసిగడుతూ జాతి ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు.
భారత్‌లోనే ముస్లీంలకు రక్షణ, 110 దేశాలలో ఇండియా నంబర్ వన్ గా నిలిచిందదని తెలిపిన సిపిఎ నివేదిక
నార్తర్న్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకను ఉద్దేశించి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Lt General Upendra Dwivedi) మాట్లాడుతూ, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విధ్వంసకర, డ్యూయల్ యూజ్ టెక్నాలజీల ఉపాధి వంటి అనేక పాఠాలను ముందుకు తెచ్చిందని అన్నారు. LACలో, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి చైనీస్ చేసిన ప్రయత్నాలకు మా ప్రతిస్పందన భారత సాయుధ దళాల వేగవంతమైన, నిస్సందేహమైన, సమన్వయంతో కూడిన చర్య.
Here's Video
ఏదైనా ప్రతికూల దూకుడు నమూనాలు లేదా ప్రయత్నాలకు ఖచ్చితంగా భారత్ సైన్యం తగిన సమాధానం చెప్పి తీరుతుందని ఆయన అన్నారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) పరిస్థితిని దౌత్య, కార్యాచరణ స్థాయిలలో పరిష్కరించడానికి చర్యలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలో భద్రతా పరిస్థితి భూభాగం, కార్యాచరణ డైనమిక్స్‌లో, ప్రత్యేకించి ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వెంబడి పొరుగు దేశాల శత్రువుల నుండి చాలా సవాళ్లను కలిగిస్తుంది, దేశం యొక్క ప్రజాస్వామ్య సంప్రదాయాలను సమర్థిస్తూ భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నామని ద్వివేది అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)