CPA Report on Religious Minorities: భారత్‌లోనే ముస్లీంలకు రక్షణ, 110 దేశాలలో ఇండియా నంబర్ వన్ గా నిలిచిందదని తెలిపిన సిపిఎ నివేదిక
India Flag

గ్లోబల్ మైనారిటీలపై సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ (సిపిఎ) ప్రారంభ అంచనా ప్రకారం, మతపరమైన మైనారిటీల పట్ల అభివృద్ధి చర్యలు చేపడుతున్న 110 దేశాలలో భారతదేశం నంబర్ వన్‌గా నిలిచిందని ఆస్ట్రేలియా టుడే నివేదించింది. సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ (CPA) అనేది భారతదేశంలోని పాట్నాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఒక పరిశోధనా సంస్థ.

110 దేశాలలో, భారతదేశం అత్యధిక స్థాయిలో మతపరమైన మైనారిటీల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.దక్షిణ కొరియా, జపాన్, పనామా, US తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ మరియు సోమాలియా జాబితాలో దిగువన ఉన్నాయి, UK మరియు UAE వరుసగా 54 మరియు 61 స్థానాల్లో వస్తున్నాయని నివేదిక పేర్కొంది. CPA నివేదిక ప్రకారం భారతదేశ మైనారిటీ విధానం వైవిధ్యాన్ని పెంపొందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. భారత రాజ్యాంగం సంస్కృతి, విద్యలో మతపరమైన మైనారిటీల అభివృద్ధికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన నిబంధనలను కలిగి ఉంది.

వాట్సాప్‌ నంబర్‌తో పుడ్ ఆర్డర్ చేయవచ్చు, త్వరలో రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ సౌకర్యం, చాట్‌బోట్ సేవ‌లను ప్రారంభిస్తున్న IRCTC

నివేదిక ప్రకారం, మరే ఇతర రాజ్యాంగంలోనూ భాషా, మతపరమైన మైనారిటీలను ప్రోత్సహించడానికి స్పష్టమైన నిబంధనలు లేవు.అనేక ఇతర దేశాల మాదిరిగా కాకుండా, భారతదేశంలో ఏ మతపరమైన విభాగాలపై ఎలాంటి పరిమితి లేదని నివేదిక హైలైట్ చేసింది.