IPL Auction 2025 Live

India-China Tensions: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, 20 మంది భారత జవాన్లు, 40 మంది చైనా సైనికులు మరణించారని వార్తలు, ప్రధానితో రక్షణమంత్రి అత్యవసర భేటీ

లడక్ గల్వాన్ లోయలో (Galwan Valley) బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు (Indian Army Soldiers) చనిపోయారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే 20 మంది భారత జవాన్లు చనిపోయారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.

Galwan Nala (Photo Credits: ANI|File)

Ladakh, June 16: చైనా, ఇండియా మధ్య సరిహద్దుల్లో యుద్ధమేఘాలు (India-China Tensions) కమ్ముకుంటున్నాయి. లడక్ గల్వాన్ లోయలో (Galwan Valley) బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు (Indian Army Soldiers) చనిపోయారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే 20 మంది భారత జవాన్లు చనిపోయారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి

అయితే నిజానికి ఇక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదని, కేవలం బాహాబాహీ, పిడిగుద్దులు, రాళ్లతో కొట్టుకోవడం వంటి ఘటనలో ఈ మరణాలు సంభవించాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు చైనా వైపు కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. 40 మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం. అయితే చైనా మాత్రం మరణాలపై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

Here's ANI Tweet

కాగా కొద్ది సేపటి క్రితం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ ప్రధానితో భేటీ అయ్యాక విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. 15వ తేదీ రాత్రి చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటేందుకు యత్నించాయని తెలిపింది. ఆ సమయంలో భారత బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలొ ప్రధానితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అత్యవసరంగా భేటీ అయ్యారు

 



సంబంధిత వార్తలు