Covid in India: 5 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు, దేశంలో ప్రస్తుతం 4,95,533 యాక్టివ్‌ కేసులు, కొత్తగా 44,111 మందికి కోవిడ్, వెల్లడవుతున్న టీకాల ఫలితాలు, వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణ హాని తక్కువని తెలిపిన అధ్యయనాలు

తాజాగా 18,76,036 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,111 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కంటే 5 శాతం తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,05,02,362కి (Covid in India) చేరాయి.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi, July 3: దేశంలో కరోనా అదుపులోకి వస్తోంది. తాజాగా 18,76,036 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,111 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కంటే 5 శాతం తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,05,02,362కి (Covid in India) చేరాయి. 24 గంటల వ్యవధిలో 738 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఏప్రిల్ 8నాటి కనిష్ఠానికి చేరింది. ఇప్పటివరకు 4,01,050 మంది మహమ్మారికి బలయ్యారు. మరో వైపు దేశంలో యాక్టివ్‌ కేసులు 95 రోజుల తర్వాత 5లక్షలకు దిగువకు చేరాయి. ప్రస్తుతం 4,95,533 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది.

నిన్న ఒక్కరోజే 57,477 మంది కొవిడ్ (Coronavirus) నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.96 కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల రేటు 1.67 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.01 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 43,99,298 మంది టీకాలు (Covid vaccine) వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 34,46,11,291 కి చేరింది. రికవరీ రేటు 97.06 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.50శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.35శాతంగా ఉందని వివరించింది. ఇప్పటి వరకు 41.64 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.

డెల్టా,బీటా వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్న కొవాగ్జిన్‌, కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను ప్రకటించిన భారత్‌ బయోటెక్, తీవ్ర లక్షణాలు నిలువరిస్తున్న వ్యాక్సిన్

కరోనాపై పోరాటంలో భాగంగా వేస్తున్న టీకాల ఫలితాలు వెల్లడవుతున్నాయి. పీజీఐ చంఢీగఢ్ టీకాల ఫలితాలపై నిర్వహించిన అధ్యయనంలో ఆశ్చర్యకర ఫలితాలు వెలుగు చూశాయి. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నవారికి కరోనా వచ్చినప్పటికీ, 98 శాతం మేరకు ప్రాణహాని తప్పుతుందని. అదే ఒక డోసు తీసుకుంటే 92 శాతం మేరకు ప్రాణహాని ఉండదని వెల్లడయ్యింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మీడియాకు... పీజీఐ చంఢీగఢ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన ఫలితాలను వెల్లడించారు. ఈ అధ్యయనం పారదర్శకంగా జరిగిందని, టీకాలు తీసుకున్న పంజాబ్ పోలీసులపై ఈ అధ్యయనం చేపట్టారన్నారు.

మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి, దేశంలో అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్‌గా మోడెర్నా గుర్తింపు

పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన 4,868 పోలీసులు టీకాలు తీసుకోలేదు. వీరికి కరోనా సోకగా, వీరిలోని 15 మంది మృతి చెందారు. దీని ప్రకారం డెత్ రేటు 3.08గా నమోదయ్యింది. 35,856 మంది పంజాబ్ సోలీసులు ఒక డోసు టీకా తీసుకున్నారు. వీరికి కరోనా సోకగా, 9 మంది మృతి చెందారు. ఇక్కడ డెత్ రేటు 0.25గా ఉంది. ఇక 42,720 మంది పంజాబ్ పోలీసులు రెండు డోసులు టీకా తీసుకోగా, వీరికి కరోనా సోకగా కేవలం ఇద్దరు మాత్రమే మృత్యువాత పడ్డారు. దీని ప్రకారం డెత్ రేటు 0.05 శాతంగా ఉన్నట్లు తేలింది.



సంబంధిత వార్తలు