New Delhi, July 3: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను భారత్ బయోటెక్ (Bharat Biotech) శనివారం ప్రకటించింది. ట్రయల్స్‌లో టీకా (Covaxin COVID-19 Vaccine) తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్‌లో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ ప్రకటించింది.
కొవాగ్జిన్ తీవ్ర లక్షణాలు నిలువరించి హాస్పిటలైజేషన్ తగ్గిస్తోందని పేర్కొంది. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ మెడ్‌జివ్ (medRxiv)లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కొవాగ్జిన్ టీకా సురక్షితమైందని రుజువైందని కంపెనీ పేర్కొంది. నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే.. జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. ట్రయల్స్‌లో 146 రోజుల పాటు.. వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు.
Here' Update
COVAXIN® Proven SAFE in India's Largest Efficacy Trial. Final Phase-3 Pre-Print Data Published on https://t.co/JJh9n3aB6V pic.twitter.com/AhnEg56vFN
— BharatBiotech (@BharatBiotech) July 2, 2021
ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లయిందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. భారత్ బయోటెక్ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో భాగంగా అత్యవసర వినియోగం కింద టీకాను వినియోగిస్తున్నారు.