Covid in India: దేశంలో భారీగా తగ్గిన కేసులు, పెరిగిన రికవరీలు, గత 24 గంటల్లో 46,148 మందికి కరోనా, 58,578 కోలుకుని క్షేమంగా ఇంటికి, క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో అమెరికాను దాటిపోయిన భారత్

కోవిడ్‌తో 979 మంది (Covid Deaths) మృతిచెందారు. సుమారు రెండున్నర నెలల(ఏప్రిల్‌13) తర్వాత తొలిసారి 1000లోపు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం రోజు 58,578 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, June 28: భారత్‌లో గడచిన 24 గంటల్లో 46,148 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. కోవిడ్‌తో 979 మంది (Covid Deaths) మృతిచెందారు. సుమారు రెండున్నర నెలల(ఏప్రిల్‌13) తర్వాత తొలిసారి 1000లోపు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం రోజు 58,578 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,79,331గా (Coornavirus) ఉంది. మొత్తం 3,96,739 మంది మరణించారు. ప్రస్తుతం 5,72,994 యాక్టీవ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,93,09,607కి చేరింది. దేశంలో 96.80 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.89 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.

క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భారత్ అమెరికాను మించిపోయింది ఇండియా. జూన్ 28నాటికి ఇండియాలో 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఇదే స‌మ‌యానికి 32,33,27,328 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయితే అమెరికా కంటే చాలా వేగంగా మ‌న ద‌గ్గ‌ర వ్యాక్సినేష‌న్ సాగుతోంది. అగ్ర‌రాజ్యం డిసెంబ‌ర్ 14న వ్యాక్సిన్లు ఇవ్వ‌డం ప్రారంభించ‌గా.. ఇండియాలో జ‌న‌వ‌రి 16న మొద‌లైంది. ఆదివారం 17.21 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ ఇవ్వ‌డంతో ఇండియా ఈ రికార్డు సాధించింది.

కరోనాపై పోరాటం ఆగదు, వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడకండి, మ‌న్ కీ బాత్ రేడియో కార్యక్ర‌మంలో ప్రధాని నరేంద్ర మోదీ, దేశం మిల్కా సింగ్‌‌ను కోల్పోవడం కలచివేసే పరిణామమని తెలిపిన భారత ప్రధాని

వ్యాక్సినేష‌న్ 163వ రోజు అయిన ఆదివారం 13.9 ల‌క్ష‌ల మంది తొలి డోసు తీసుకోగా.. 3.3 ల‌క్ష‌ల మంది రెండో డోసు తీసుకున్నారు. ప్ర‌స్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసును 12-16 వారాల మ‌ధ్య ఇస్తుండ‌గా.. కొవాగ్జిన్ రెండో డోసు 4 వారాల త‌ర్వాత ఇస్తున్నారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ కేంద్ర ప్ర‌భుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తున్న విష‌యం తెలిసిందే. తొలి రోజు రికార్డు స్థాయిలో 87 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.