Coronavirus in India: దేశంలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన కేసులు, తాజాగా 37,566 మందికి కోవిడ్, 56,994 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం దేశంలో 5,52,659 లక్షల యాక్టీవ్‌ కేసులు, ముంబైలో సగానికి పైగా పిల్లల్లో కోవిడ్‌ యాంటీబాడీలు

గడచిన 24 గంటల్లో 37,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 1000లోపు మరణాలు సంభవించాయి.

Coronavirus Outbreak: (Photo-IANS)

New Delhi, June 29: భారత్‌లో తాజాగా కొత్త కేసుల సంఖ్య 40 వేలకు దిగువకు (Coronavirus in India) పడిపోయాయి. గడచిన 24 గంటల్లో 37,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 1000లోపు మరణాలు సంభవించాయి. కోవిడ్‌తో నిన్న 907 మంది (Covid Deaths) మృతిచెందారు. సోమవారం రోజు 56,994 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,16,897గా ఉంది. మొత్తం 3,97,637 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,93,66,601 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,52,659 లక్షల యాక్టీవ్‌ కేసులున్నాయి. దేశంలో 96.87 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.82 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదాపు 51.8 శాతం మంది పిల్లల్లో(1–18 సంవత్సరాల వయసు) కోవిడ్‌వైరస్‌కు వ్యతిరేక యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు సీరో సర్వేలో తేలిందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) తెలిపింది. ధర్డ్‌ వేవ్‌ వస్తుందన్న భయాల నేపథ్యంలో బీఎంసీ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌– జూన్‌ కాలంలో 2,176 బ్లడ్‌ శాంపిల్స్‌ను పరీక్షించారని తెలిపింది.

కేంద్రం నుంచి క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్, కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం, ఆరోగ్య రంగానికి రూ. 50 వేల కోట్లు, ఇత‌ర రంగాల‌కు సుమారు 60 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

యాంటీబాడీలున్న పిల్లల సంఖ్య గత సర్వేతో పోలిస్తే పెరిగినట్లు బీఎంసీ తెలిపింది. బీవైఎల్‌ నాయర్‌ హాస్పిటల్, కేఎండీఎల్‌ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. సీరో సర్వేలో ప్రజల బ్లడ్‌ సీరమ్‌ను పరీక్షించి ట్రెండ్‌ను అధ్యయనం చేస్తారు. కరోనా ఆరంభం నుంచి ఇది మూడో సీరో సర్వే అని బీఎంసీ వెల్లడించింది. 10–14 సంవత్సరాల వయసు పిల్లల్లో సీరో పాజిటివిటీ అత్యధికంగా 53.43 శాతం ఉందని, 1–4 సంవత్సరాల పిల్లల్లో 51.04 శాతం, 5–9 సంవత్సరాల పిల్లల్లో 47.33 శాతం, 15–18 సంవత్సరాల పిల్లల్లో 51.39 శాతం సీరో పాజిటివిటీ ఉందని తెలిపింది.