Rs 1.1 Lakh Crore Loan Guarantee Scheme: కేంద్రం నుంచి క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్, కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం, ఆరోగ్య రంగానికి రూ. 50 వేల కోట్లు, ఇత‌ర రంగాల‌కు సుమారు 60 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
FM Nirmala Sitharaman. (Photo Credits: Twitter@FinMinIndia)

New Delhi, June 28: దేశంలో సెకండ్ వేవ్ COVID-19 వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆర్థిక మంత్రి కొన్ని కొత్త సహాయక చర్యలను ప్రకటించారు. కోవిడ్ ప్రభావిత రంగాలకు (COVID-19 Affected Sectors) రూ .1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని (Rs 1.1 Lakh Crore Loan Guarantee Scheme) ప్రకటించారు, అందులో రూ .50 వేల కోట్లు ఆరోగ్య రంగానికి కేటాయించారు.మొత్తం 8 రంగాల‌కు ఆర్థిక ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది క‌రోనా ఫ‌స్ట్ వేవ్ నేప‌థ్యంలోనూ కొన్ని రంగాల‌కు ఊర‌ట క‌ల్పించిన విష‌యం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్రం ఈ కొత్త చర్యలను ప్రకటించింది. కోవిడ్ రిలీఫ్ కోసం చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది.

ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్‌లో భాగంగా ఉద్దీప‌న ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించారు. కోవిడ్ వ‌ల్ల దెబ్బ‌తిన్న రంగాల‌కు 1.1 ల‌క్ష కోట్ల లోన్ గ్యారెంటీ, వైద్య మౌళిక‌స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు రూ. 50 వేల కోట్లు ఇవ్వ‌నున్నారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద 25 ల‌క్ష‌ల మందికి రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ‌ల‌కు ఈ రుణం అందించ‌నున్నారు. గరిష్టంగా రూ.1.25 లక్షల వరకూ రుణం ఇస్తామని అన్నారు.

దేశంలో భారీగా తగ్గిన కేసులు, పెరిగిన రికవరీలు, గత 24 గంటల్లో 46,148 మందికి కరోనా, 58,578 కోలుకుని క్షేమంగా ఇంటికి, క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో అమెరికాను దాటిపోయిన భారత్

ఇత‌ర రంగాల‌కు సుమారు 60 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని మంత్రి (Nirmala Sitharaman) ప్ర‌క‌టించారు. ఆ రుణాల‌కు ప‌న్ను వ‌సూల్ శాతాన్ని 8.25 శాతంగా ఫిక్స్ చేశారు. ట్రావెల్‌, టూరిజం రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించారు. సోమవారంనాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ఎనిమిది ఆర్థిక ఉపశమన చర్యల్లో నాలుగు పూర్తిగా కొత్తవని, ఒకటి హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించినదని చెప్పారు.

11వేల మంది టూరిస్టు గైడ్లు, ట్రావెల్‌, టూరిజం స్టేక్‌హోల్డ‌ర్ల‌కు రుణాలు క‌ల్పిస్తారు. వంద శాతం గ్యారెంటీతో ఆ రుణాలు ఇవ్వ‌నున్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల రాక మొద‌లైన త‌ర్వాత తొలి 5 ల‌క్ష‌ల మంది టూరిస్టుల‌కు ఉచితంగా వీసాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ రోజ్‌గార్ యోజ‌న‌ను ఈ ఏడాది జూన్ 30వ తేదీ నుంచి వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కు పొడిగించారు.

ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు రూ.23,220 కోట్లు కేటాయించారు. చిన్నారుల సంర‌క్ష‌ణపై ఈ స్కీమ్‌లో ఎక్కువ‌గా కేంద్రీక‌రించిన‌ట్లు మంత్రి నిర్మ‌ల తెలిపారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌నున్నారు. న‌ర్సులు, డాక్ట‌ర్లు, వైద్య ప‌రిక‌రాలు, అంబులెన్సులు, ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. కానీ చిన్నారుల భ‌ద్ర‌తే ముఖ్యంగా ఆ నిధుల్ని ఖ‌ర్చు చేస్తారు. కోవిడ్ కేంద్రీకృత హాస్పిట‌ళ్లు 25 శాతం పెరిగిన‌ట్లు ఆమె చెప్పారు. 42 శాతం ఐసోలేష‌న్ బెడ్స్‌, 45 శాతం ఐసీయూ బెడ్స్ పెరిగిన‌ట్లు మంత్రి తెలిపారు.

ఫ‌ర్టిలైజ‌ర్ల స‌బ్సిడీ కోసం 14,775 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ర‌బీ సీజ‌న్‌లో రికార్డు స్థాయిలో గోధుమ‌ల‌ను సేక‌రించిన‌ట్లు మంత్రి చెప్పారు. ర‌బీ మార్కెట్ సీజ‌న్ వేళ నేరుగా రైతుల అకౌంట్లోకి 85,413 కోట్లు బ‌దిలీ చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. పాత రుణాల వసూళ్లపై కాకుండా కొత్త రుణాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. చిన్న పట్టణాలతో పాటు మారుమాలు ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని తీసుకు వెళ్తామని మంత్రి తెలిపారు. న్యూ క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్ కింద వడ్డీ రేటు 2 శాతంగా ఉంటుందని, ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన వడ్డీ రేటు కంటే తక్కువని చెప్పారు. రుణాల చెల్లింపునకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు.