Coronavirus in India: కరోనా నుంచి కోలుకున్న ఇండియా, కేసులు తగ్గుముఖం, 24 గంటల్లో 1,73,790 కొత్త కేసులు నమోదు, 3,617 మంది మృతితో ,22,512కు పెరిగిన మరణాల సంఖ్య, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్
గత 24 గంటల్లో 1,73,790 కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటి ప్రకారం... నిన్న 2,84,601 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,29,247కు (Coronavirus India) చేరింది. మరో 3,617 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,22,512కు పెరిగింది.
New Delhi, May 29: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,73,790 కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటి ప్రకారం... నిన్న 2,84,601 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,29,247కు (Coronavirus India) చేరింది. మరో 3,617 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,22,512కు పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,51,78,011 మంది కోలుకున్నారు. 22,28,724 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,89,02,445 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,11,19,909 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది. నిన్న 20,80,048 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్న వ్యక్తులు ఫంగస్ (Fungus) లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడితే.. కోలుకోవడం కష్టమవుతోందని, అలాంటి వారిలో సగానికి పైగా మరణాలు సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా పది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 17,534 మంది కొవిడ్ రోగులపై ఐసీఎంఆర్ ఈ అధ్యయనం నిర్వహించింది. వీరిలో 3.6 శాతం ఫంగ్‌స/ఇతర బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డారని, 56.7శాతం మరణించారని తెలిపింది. దేశంలో కొవిడ్ రోగులకు యాంటీబయాటిక్స్ అధికంగా వాడుతున్నారని, వీటివల్ల సూపర్ బగ్స్ తయారై.. ఇతర ఫంగ్‌స/బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతున్నాయని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కామిని వాలియా తెలిపారు. యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియా.. సూపర్ బగ్‌గా తయారై ప్రాణాంతకంగా మారుతోందన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు కల్లా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అప్పటి కల్లా 216 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ఆరోగ్య శాఖ ప్రణాళిక సిద్దం చేసిందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి ఓ ప్రణాళిక అంటూ ఏమీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలోనే జవదేకర్ ఈ మేరకు కౌంటర్ ఇవ్వడం గమనార్హం. కాగా 2021 చివరికల్లా దేశంలోని కనీసం వయో జనులకైనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయగలమని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో మరిన్ని కొవిడ్ మ్యూటేషన్లు తలెత్తే అవకాశం ఉండడంతో పాటు చిన్నారులకు సైతం ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆస్పత్రులన్నిటినీ ఆధునికీకరించాలని కేంద్రం భావిస్తున్నట్టు హర్షవర్థన్ పేర్కొన్నారు.