Covid in India: దేశంలో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ అలజడి, భారీగా పెరిగిన రోజువారీ కేసులు, గత 24 గంటల్లో 12,591 మందికి కరోనా, 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్‌ వచ్చింది. గత ఎనిమిది నెలల్లో ఒకేరోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

Covid in India (PIC @ PTI)

New Delhi, April 20: దేశంలో కోవిడ్‌-19 (Covid-19) మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్‌ వచ్చింది. గత ఎనిమిది నెలల్లో ఒకేరోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. బుధవారం నాటికంటే ఇది 20 శాతం అధికం. నిన్న 10,542 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా, వర్క్ ఫ్రం హోం దెబ్బేనా, 142.86 కోట్లు దాటిన భారత్ జనాభా, చైనా కంటే దాదాపు 30 లక్షలు ఎక్కువ, మూడవ స్థానంలో అమెరికా

మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.48 కోట్లకు పెరిగింది. ఇందులో 4,42,61,476 మంది బాధితులు కోలుకున్నారు. మరో 65,286 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 29 మంది మరణించడంతో మృతులు 5,31,230కి చేరారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతం కాగా, 0.15 శాతం కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.67 శాతం మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.