Coronavirus in India: డాక్టర్‌పై ఉమ్మేసిన కరోనా పేషెంట్లు, త్రిపురలో అమానుష ఘటన, దేశంలో 24 గంటల్లో 47,704 కోవిడ్-19 కేసులు నమోదు, 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు

సోమవారం ఒక్కరోజే 654 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటి వరకు 33,425 మంది మృత్యువాత (Coronavirus Deaths) పడగా.. 9,52,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం మొత్తం 5,28,082 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

coronavirus in idnia (Photo-PTI)

New Delhi, July 28: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,704 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 654 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటి వరకు 33,425 మంది మృత్యువాత (Coronavirus Deaths) పడగా.. 9,52,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం మొత్తం 5,28,082 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు, తూర్పు గోదావరిలో ఆగని కోవిడ్-19 కల్లోలం, ఏపీలో 1,090కు చేరిన మృతుల సంఖ్య, కర్ణాటకలో లక్ష దాటిన కరోనా కేసులు

రిక‌వ‌రీ రేటు 64.23 శాతానికి పెరిగిన‌ట్లు ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. వైర‌స్ సోకిన వారిలో 96.6 శాతం కోలుకోగా.. 3.4 శాతం మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా జులై 27వ తేదీ వ‌ర‌కు 1,73,34,885 మందికి కోవిడ్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. నిన్న ఒక్క రోజే 5,28,082 మందికి కోవిడ్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఐసీఎంఆర్ (ICMR) పేర్కొన్న‌ది.

మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,924 క‌రోనా కేసులు నమోదయ్యాయి. 227 మంది మృతిచెందారు. కాగా ఒక్కరోజులోనే 8,706 మందికి పైగా కోలుకుని డిశ్చార్జ్ కావ‌డం విశేషం. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,83,723 కు చేరింది. మొత్తం 13,883 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,21,944 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 57.84 శాతానికి చేరుకుంది. మరణాల రేటు 3.62గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,47,592. కాగా గ‌డ‌చిన 24 గంట‌ల్లో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 129 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన పూణే డివిజన్‌లో 52 మంది మృతి చెందారు. పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్‌ బ్యాన్‌, 275 యాప్‌ల‌పై నిషేధం దిశగా అడుగులు

ఇదిలా ఉంటే కోవిడ్ వార్డులో పేషెంట్ల‌ను చేర్పించేందుకు ప్ర‌య‌త్నించిన‌ వైద్యురాలిపై క‌రోనా పేషెంట్లు ఉమ్మివేసిన అమానుష ఘ‌ట‌న శుక్ర‌వారం త్రిపుర‌లో చోటు చేసుకుంది. వెస్ట్ త్రిపుర జిల్లాలోని భ‌గ‌త్ సింగ్ యూత్ హాస్టల్‌ను కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చారు. ఇందులోకి కోవిడ్ సోకిన‌ ఐదుగురు మ‌హిళ‌ల‌ను చేర్పించేందుకు ఆ జిల్లా ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి డా.సంగీత చ‌క్ర‌బొర్తి శుక్ర‌వారం స‌ద‌రు కోవిడ్ కేర్ సెంట‌ర్‌కు చేరుకున్నారు. అయితే అక్క‌డున్న‌వారు ఇప్ప‌టికే ఈ సెంట‌ర్ నిండిపోయింద‌ని, మ‌ళ్లీ కొత్త పేషెంట్ల‌ను చేర్చుకోవ‌ద్దంటూ గొడ‌వ చేశారు. అక్క‌డున్న డాక్ట‌ర్లు వారికి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా ఎదురు దాడికి దిగారు. ఈ క్ర‌మంలో అక్క‌డి క‌రోనా బాధితులు చ‌క్ర‌బొర్తిపై ఉమ్మివేసి వేధింపుల‌కు పాల్ప‌డ‌ట‌మే కాక‌, ఉద్దేశ‌పూర్వ‌కంగా వైర‌స్‌ వ్యాప్తికి ప్ర‌య‌త్నించారు.

దీనిపై కేసు న‌మోదు చేసిన జిల్లా ఎస్పీ మానిక్ లాక్ దాస్ సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్ద‌రు నిందితుల‌ను గుర్తించామ‌న్నారు. క‌రోనా నుంచి కోలుకోగానే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. కాగా కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో 300 బెడ్లు ఉంటే 270 పేషెంట్లు మాత్ర‌మే ఉన్నార‌ని అధికారులు తెలిపారు. అందువ‌ల్లే వైద్యురాలు చ‌క్ర‌బొర్తి కొత్తగా ఐదుగురిని తీసుకెళ్లిన‌ట్లు వివ‌రించారు