AP Corona Bulletin: ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు, తూర్పు గోదావరిలో ఆగని కోవిడ్-19 కల్లోలం, ఏపీలో 1,090కు చేరిన మృతుల సంఖ్య, కర్ణాటకలో లక్ష దాటిన కరోనా కేసులు
Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati, July 27: ఏపీలో గత 24 గంటల్లో 6,051 కొత్త కేసులు (AP Corona Bulletin) నమోదయ్యాయి, సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష (Coronavirus positive cases) దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ రోజు 43,127 మందికి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో 6,051 మంది కొవిడ్- 19 పాజిటివ్ నిర్ధారించారు. ఈ కేసులతో కలిపి 1,02,349కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 51,701 యాక్టివ్‌ కేసులున్నాయి. గుజరాత్‌లో మిస్టరీగా మారిన కరోనా మరణాలు, దేశంలో 14 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో 49,558 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 16,86,446 కరోనా టెస్టులు చేశారు. ఇక మరణాలు కూడా ఏపీని వణికిస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 1,090 మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, చిత్తూర్ జిల్లాలో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కర్నూల్ జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. విశాఖలో చిన్న పిల్లల అక్రమ రవాణా గుట్టు రట్టు, కీలక సూత్రధారి పచ్చిపాల నమ్రతతో పాటు మరో ఆరుగురు ఆరెస్ట్, కేసు వివరాలను వెల్లడించిన సీపీ ఆర్కే మీనా

తూర్పు గోదావరిలో ఈ రోజు అత్యధికంగా 1,210 కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లా కేసుల్లో రెండో స్ధానంలో ఉంది. అక్కడ ఈ రోజు 744కి కరోనా సోకింది. కర్నూలు జల్లాలో 664, విశాఖ జిల్లాలో 655, అనంతపురం జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 422, పశ్చిమగోదావరి జిల్లాలో 408, చిత్తూరు జిల్లాలో 367, కడప జిల్లాలో 336, ప్రకాశం జిల్లాలో 317, విజయనగరం జల్లాల్లో 157, శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు నమోదయ్యాయి.

Here's AP Corona Report

కర్ణాటకలో లక్ష దాటిన కరోనావైరస్ కేసులు

కర్ణాటక సోమవారం లక్ష కోవిడ్ -19 కేసులను (Karnataka Coronavirus) దాటింది. బెంగళూరులో కేసుల పెరుగుదలకు ఆజ్యం పోసిన కర్ణాటకలో పరిస్థితి జూలై ప్రారంభం నుండి రోజుకు 2000 మార్కును దాటి, ఇప్పుడు రోజుకు 5000 కి పైగా నమోదయ్యే స్థితికి చేరుకుంది. జూలై 1 నుండి కర్ణాటకలో 86,223 కొత్త కేసులు నమోదు కాగా, బెంగళూరులో సగం కేసులు అంటే 42,368 నమోదయ్యాయి, జూన్ 30 న వరుసగా 15,242 మరియు 4555 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 5324 కేసులు నమోదు కాగా బెంగళూరులోనే 1470 సహా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై ప్రారంభం నుండి, కోవిడ్ -19తో కర్ణాటకలో 1707 మంది మరణించగా, బెంగళూరులోనే 822 మంది మరణించారు. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 1,01,465కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 61,819. ఇప్పటివరకూ కర్ణాటకలో 1,953 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

కరోనా కల్లోలానికి అల్లాడుతున్న మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో గత 24 గంటల్లో 6993 కరోనా కేసులు, 77 కరోనా మరణాలు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,20,716కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 54,896. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడం, ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు కరోనాను అంత సీరియస్‌గా తీసుకోకుండా గతంలో మాదిరిగా రోడ్ల పైకి వస్తుండటం కొంత ఆందోళన కలిగించే విషయం.