New Delhi, July 27: భారత్‌లో కరోనావైరస్ కేసులు (India Coronavirus Pandemic), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 708 మంది కరోనా కారణంగా ప్రాణాలు (COVID-19 Deaths) కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases) ఇప్పటివరకు మొత్తం 14,35,453కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,771కి పెరిగింది. అన్‌లాక్ 3.0 లేక లాక్‌డౌన్ కంటిన్యూ? వచ్చేవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, దేశంలో విశ్వరూపం దాల్చిన కరోనా
4,85,114 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,17,568 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,68,06,803 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 5,15,472 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
గుజరాత్‌లో కరోనావైరస్ రోగుల మరణాలు (Gujarat Coronavirus Deaths) వైద్యులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నెల 17 సూరత్‌లో 70 ఏండ్ల హెమిబెన్ అనే మహిళ కరోనానుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన గంటలోపే మరణించారు. రెండు నెలల క్రితం అహ్మదాబాద్‌లో చగన్ మక్వాలా అనే వ్యక్తి కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోకముందే మరణించాడు.
ANI Update:
India's COVID tally cross 14 Lakhs mark with 708 deaths & highest single-day spike of 49,931 cases reported in last 24 hours.
Total #COVID19 positive cases stand at 14,35,453 including 4,85,114 active cases, 9,17,568 cured/discharged/migrated & 32,771 deaths: Health Ministry pic.twitter.com/WbumsPdukU
— ANI (@ANI) July 27, 2020
ఈ మిస్టరీ మరణాలపై రాష్ట్ర వైద్యశాఖ అధికారులు పరిశోధనలు మొదలుపెట్టారు. కరోనా రోగుల్లో (corona Patients) మెదడు ఇతర రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నదని, దాంతో హటాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారని గుజరాత్ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు తుషార్ పటేల్ తెలిపారు. బాబీజీ పాపడ్ తినండి, కరోనాను జయించండి, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వివాదాస్పద ప్రచారం, సుమోటోగా చర్యలు చేపట్టాలంటున్న నెటిజన్లు
ఈ నెలాఖరుతో అన్‌లాక్ 2.0 (Unlock 2.0) ముగియనున్న నేపథ్యంలో, తదుపరి దశలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు మరోసారి రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 16, 17 తేదీల్లో సీఎంలతో మాట్లాడిన తరువాత, మరోసారి ప్రధాని మోదీ సమావేశం నిర్వహించడం ఇదే. అన్ లాక్ ను ప్రారంభించినప్పటి నుంచి దేశంలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో, తదుపరి ఏఏ రంగాలకు ఉపశమనం ఇవ్వాలన్న విషయమై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాగా, నేడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సీఎంలతోనే మోదీ ప్రత్యేకంగా మాట్లాడతారని పీఎంఓ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తదితర సీనియర్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో అన్ లాక్ 2.0 సమయంలో కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకోనున్న పీఎం, వారి నుంచే సలహాలు, సూచనలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఏడవసారి. ఈ సమావేశం అనంతరం, ఆగస్టు 1 నుంచి అమలు చేయాల్సిన నిర్ణయాలపై ప్రధాని కీలక నిర్ణయాలను తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచడం, కంటెయిన్ మెంట్ జోన్లలో మరిన్ని ఆంక్షలు, ప్రజల్లో ఇంకా అవగాహన పెంచడం, రికవరీల సంఖ్యను పెంచేందుకు చర్యలు... తదితర అంశాలతో పాటు చిత్ర పరిశ్రమకు ఊరటను ఇవ్వడం, జిమ్ లను తెరిపించడం వంటి అంశాలపైనా పీఎం చర్చిస్తారని తెలిపారు.