New Delhi, July 24: కరోనా వైరస్ కోసం ఓవైపు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలయి ఉన్నాయి. ఇప్పటికీ దీనికి సరైన వ్యాక్సిన్ రాలేదు. అయితే కొందరు దీన్ని క్యాష్ చేసుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి (Arjun Ram Meghwal) కూడా ఇందులో భాగం కావడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
వివరాల్లోకెళితే.. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఆత్మనిర్భర్ పథకం కింద తయారీదారులు బాబీజీ పాపడ్‌ను (Bhabhi Ji Papad) తయారుచేశారు.ఇది కరోనాతో పోరాడేందుకు ఉపయోగపడుతుంది. తయారీదారులకు మంచి వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను.' అంటూ ఓ వీడియోలో రామ్ మేఘ్‌వాల్ స్పష్టం చేశారు.ఈ వీడియోలో మేఘ్వాల్ భాబీజీ పాపడ్‌ను చూపుతూ (Arjun Meghwal launches papad) కనిపించారు. ఆ అప్పడాలు తింటే కరోనా వైరస్‌తో పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీస్ (antibodies) అభివృద్ది చెందుతాయని అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వ్యాఖ్యానించారు.
Watch Video:
In a viral video, Union Minister of State for Parliamentary Affairs Arjun Meghwal is found launching a 'papad' brand claiming that it can help develop antibodies against Covid-19.
Arvind with details.
DISCLAIMER: Viral video. TIMES NOW does not vouch for its authenticity. pic.twitter.com/8SZm07HY2D
— TIMES NOW (@TimesNow) July 24, 2020
అప్పడాలు తింటే కరోనా పోతుందని ప్రచారం చేయడం చౌకబారుతనమే అన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివాళ్ల కోసమే కాంగ్రెస్ హయాంలో విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చామని యూత్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో సెటైర్ వేసింది. మరికొందరు నెటిజెన్స్ మాత్రం కేంద్రమంత్రి వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నవేళ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు.
Here's Netizen Tweet
Is it possible either @DelhiPolice or @PoliceRajasthan take suo moto action against @arjunrammeghwal
ji for spreading fake and unscientific information during pandemic. https://t.co/wjAeAVEcP6
— Hitendra Pithadiya 🇮🇳 (@HitenPithadiya) July 24, 2020
అయితే ఈ వీడియోపై ఇంతవరకూ బీజేపీ నుంచి కానీ కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు.అయితే తమ ప్రోడక్ట్‌లో వ్యాధినిరోధకశక్తిని పెంచే పలు పదార్ధాలు ఉన్నాయని ఈ పాపడ్‌ను తయారుచేస్తోన్న బికనీర్‌కు (Bikaner)చెందిన కంపెనీ పేర్కొంది .