Coronavirus in India: తాజాగా 90,633 మందికి కరోనా వైరస్, దేశంలో 41,13,812కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 1065 మంది మృత్యువాతతో 70,626 కు చేరిన మరణాల సంఖ్య
దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1065 మంది మృత్యువాతపడగా, మొత్తం 70,626 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31,80,866 మంది కరోనానుంచి కోలుకుని (COVID19 Recoveries) డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
New Delhi, September 6: భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1065 మంది మృత్యువాతపడగా, మొత్తం 70,626 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31,80,866 మంది కరోనానుంచి కోలుకుని (COVID19 Recoveries) డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నప్పటికీ, కోలుకునేవారి సంఖ్య కూడా అంతేమొత్తంలో ఉంటున్నది. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు 70,072 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.73 శాతంగా ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా 41 లక్షల కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ చేరింది. ఇప్పటివరకు అమెరికా, బ్రెజిల్‌లో ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 64,31,152 కేసులు నమోదవగా, రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 41,23,000 మంది కరోనా బారినపడ్డారు. తాజాగా భారత్‌లో కూడా కరోనా కేసులు 41,13,812కు చేరాయి. కాగా, దేశంలో ఇంతే భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైతే మరో రోజులోనే అత్యధిక కేసుల దేశాల జాబితాలో భారత్ రెండో స్థానాకి చేరుతుంది.
వెయిటింగ్ లిస్టు ఉండదు, ఈ నెల 10 నుంచి 80 ప్రత్యేక రైళ్లకు బుకింగ్ ప్రారంభం
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 10,92,654 మంది కరోనా పరీక్షలు నిర్వహించామని, దీంతో సెప్టెంబర్ 5 వరకు మొత్తం 4,88,31,145 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధాన మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది.