Indian Railways: వెయిటింగ్ లిస్టు ఉండదు, ఈ నెల 10 నుంచి 80 ప్రత్యేక రైళ్లకు బుకింగ్ ప్రారంభం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ, వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు ఇకపై ముందుగానే గమ్యానికి
Train (Photo Credits: PTI)

New Delhi, September 5: అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ( Special Passenger Trains) ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేబోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ (Vinod Kumar Yadav) శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి రెగ్యులర్‌ రైలు సర్వీసులు స్తంభించిపోయాయి. కాగా ఏ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ ఎక్కువగా ఉన్నదో తెలుసుకోవడానికి ప్రస్తుతం నడుస్తున్న అన్ని రైళ్లను రైల్వేశాఖ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఏదైనా ప్రత్యేక రైలుకు డిమాండ్‌ ఉండటం లేదా వెయిటింగ్‌ లిస్ట్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాస్తవ రైలు కంటే ముందుగానే క్లోన్‌ రైలును నడపడం ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారని ఆయన చెప్పారు. పరీక్షలు లేదా ఇతర సందర్భాల్లో రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్‌ మేరకు మరిన్ని రైళ్లను నడుపుతామని యాదవ్‌ వివరించారు. ఇతరులతో సంబంధం లేకుండా టాయ్‌లెట్ పైపుల ద్వారా కోవిడ్19

పరీక్షలు, ఇదే తరహా కారణాలతో రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా రైళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. బుల్లెట్ ట్రైన్స్‌పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పురోగతి దశలో ఉందన్నారు. భూముల సేకరణ నిర్ధారణ అయిన తర్వాత ట్రైమ్ ఫ్రేమ్‌లో పని జరుగుతుందన్నారు. గుజరాత్ నుంచి 82 శాతం, మహారాష్ట్ర నుంచి 23 శాతం భూసేకరణ ఉంటుందన్నారు.