Coronavirus Spread: కరోనాపై దిమ్మతిరిగే న్యూస్, ఇతరులతో సంబంధం లేకుండా టాయ్‌లెట్ పైపుల ద్వారా కోవిడ్19, చైనాలో వెలుగుచూసిన వాస్తవం
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Beijing, Sep 5: కరోనావైరస్ పై కొత్త కొత్త విషయాలు (Coronavrius Spread) తెలుస్తున్నాయి. మనుషులు పక్క పక్కన లేనప్పటికీ వారికి ఏ సంబంధం లేకుండానే కరోనావైరస్ వ్యాప్తి జరుగుతోందని అధికారులు తేల్చి చెప్పారు. తాజాగా టాయెలెట్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి (spread through plumbing) జరుగుతుందని పరిశోధకులు తేల్చారు. చైనాలోని గ్వాంజౌ నగరంలోని ఓ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 15వ అంతస్తులో నివసిస్తున్న ఐదుగురు సభ్యులుగల ఓ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది.

అయితే వారి కారణంగా 25వ, 27వ అంతస్తుల్లో నివసిస్తున్న దంపతులకు (Three Chinese families on different floors) కూడా కరోనా వైరస్‌ సోకింది. వారు ఏనాడు ఒకరికి ఒకరు కలుసుకోలేదు. అలాగే కరోనా వైరస్‌ సోకిన రోగులు ఉపయోగించిన మెట్లు లేదా లిఫ్ట్‌లు కూడా వాడలేదు. అయినప్పటికీ వారికి కోవిడ్ 19 వచ్చింది. ఇదెలా సాధ్యం అని వైద్య నిపుణులు ఆలోచన చేస్తే కొత్త విషయాలు తెలిసాయి.

వైరస్‌ను గుర్తించే మైక్రో లెన్స్‌ల ద్వారా 15వ అంతస్తులోన్ని అన్ని గదులను శోధించారు. అందులోని మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లోని వాష్‌రూమ్‌ కమోడ్‌లో కరోనా వైరస్‌ ఎక్కువగా కనిపించింది. కమోడ్‌ నుంచి ఆపార్ట్‌మెంట్‌ వెలుపలి నుంచి వెళ్లే గ్యాస్‌ పైప్‌లైన్‌లోనూ కరోనా వైరస్‌ కనిపించింది. అదే పైప్‌ లైన్‌ వెంట వైద్య నిపుణులు పరిశీలిస్తూ పోగా, 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌లో ఓ మోస్తారుగా, 25,27 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌లో తీవ్ర స్థాయిలో కరోనా వైరస్‌ కనిపించింది. శానిటైజర్లు పేలుతున్నాయ్..అమెరికాలో భారీ శబ్దంతో పేలిన శానిటైజర్ బాటిల్

15వ అంతస్తులో కరోనా సోకిన వ్యక్తుల నుంచి టాయ్‌లెట్‌ గ్యాస్‌ పైప్‌ ద్వారా కరోనా వైరస్‌ 25, 27 అంతస్తుల్లోని దంపతులకు వైరస్‌ సోకినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌లో కూడా వైరస్‌ కనిపించినందున వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.

కమోడ్‌ గ్యాస్‌ పైప్‌ నుంచి కరోనా వైరస్‌ ‘బయో ఎయిరోసోల్స్‌’ రూపంలో బయటకు వస్తుందని, గాలిలో వైరస్‌ 30 నిమిషాలపాటు జీవించి ఉంటుందని, టాయ్‌లెట్స్‌కు సరైన వెంటిలేషన్‌ ఉండి, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉన్నట్లయితే అర నిమిషంలో సగం వైరస్, నిమిషంలో పూర్తి వైరస్‌ బయటకు వెళ్లిపోతుందని నిపుణులు తెలిపారు. రెండు అంతస్తుల్లోని వద్ధ దంపతులు బాత్‌రూమ్‌ వెంటిలేటర్లను తెరవక పోవడం వల్ల, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను అసలు వాడక పోవడం వల్ల వారి బాత్‌రూమ్‌లో వైరస్‌ ఎక్కువ కాలం ఉండి ఉంటుందని, తద్వారా వారికి సోకి ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. 15వ అంతస్తులోని కుటుంబ సభ్యులు కరోనా ఆవిర్భవించిన ‘వుహాన్‌’ పట్టణం నుంచి కొంతకాలం క్రితమే వచ్చారట. అక్కడ వారు వైరస్‌ బారిన పడి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.