Hand Sanitizer Exploded: శానిటైజర్లు పేలుతున్నాయ్..అమెరికాలో భారీ శబ్దంతో పేలిన శానిటైజర్ బాటిల్, తీవ్ర గాయాల పాలైన మహిళ, టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
Hand sanitizers (Photo Credits: IANS)

Texas, Sep 5: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ దడ పుట్టిస్తోంది. దీనికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ రాకపోవడంతో జాగ్రత్తలతోనే అందరూ దీన్ని ఎదుర్కుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలే కొంపలు ముంచుతున్నాయి. కరోనా రాకుండా కాపాడుకునేందుకు వాడే శానిటైజర్ బాటిల్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకెళితే..అమెరికాలోని టెక్సాస్‌లో శానిటైజర్‌ బాటిల్‌ పేలటంతో (Hand Sanitizer Exploded) ఓ మహిళ శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది.

అమెరికాలోని టెక్సాస్‌ కు చెందిన కేట్‌ వైడ్‌ అనే మహిళ (Texas Woman) గత ఆదివారం రోజూలానే ఆ రోజు కూడా చేతులకు శానిటైజర్‌ రాసుకుంది. అయితే అది రాసుకున్న తర్వాత కొవ్వొత్తి వెలిగిద్దామని అగ్గిపుల్ల గీసింది. అంతే ఆమె చేతికి మంటలు (hand-sanitizer-exploded-trying-light-candle) అంటుకున్నాయి. దీంతో భయపడ్డ ఆమె వెంటనే వెనక్కు దూకేసింది. ఇలా దూకిన సమయంలో అనుకోకుండా వెనకాల ఉన్న శానిటైజర్‌ బాటిల్‌ను తాకింది. వెంటనే మంటలు శానిటైజర్‌ బాటిల్‌ను అంటుకోవటంతో బాంబ్‌లాగా అది పెద్ద శబ్ధంతో పేలింది. బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం

ఈ పేలుడు ధాటికి పెద్ద ఎత్తున​ ఎగిసి పడ్డ మంటలు ఆమెను ఇంటిని చుట్టుముట్టాయి. ఈ అగ్ని ప్రమాదంలో కేట్‌ ముఖం, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న కేట్‌ కూతుళ్లు స్థానికుల సహాయంతో ఆమెను‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Here's Daily Mail US Tweet

ఇక అధిక మోతాదులో శానిటైజర్‌ వాడటం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తరచుగా శానిటైజర్‌ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుందని, శానిటైజర్‌కు అలవాటుపడి, అది నిరోధక శక్తిని పెంచుకుంటుందని వారు చెబుతున్నారు. ఇక మనం శానిటైజర్‌తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుందని అంటున్నారు. సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా శానిటైజర్‌ వాడకానికి దూరంగా ఉండండని సూచిస్తున్నారు. ఓ 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని తరిమికొట్టొచ్చని ‘యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ చెబుతోంది. మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్

మీ చేతులకు విపరీతంగా దుమ్ము, ధూళీ అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్‌ను‌ ఉపయోగించకండి. చేతులు ఎక్కవ అపరిశుభ్రంగా ఉన్నపు​డు ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తాయి. అంతేకాకుండా క్రిముల్ని చంపడంలోనూ విఫలమవుతాయి.అలాగే చుట్టుప్రక్కల ఉన్న వారు తుమ్మినా, దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్‌ రాసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదు. గాల్లోని క్రిములను శానిటైజర్‌ చంపలేదని గుర్తించాలి. అదో భయానికి గురై తరచూ దాన్ని వాడటాన్ని తగ్గించుకోవాలి. పిల్లలకు, టీనేజర్లకు కరోనా ముప్పు ఎక్కువ

పిల్లలు మీ చుట్టు ప్రక్కల ఉన్నపుడు శానిటైజర్‌కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వారు గనుక శానిటైజర్‌ను శరీరంలోకి తీసుకున్నట్లయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకని, పిల్లలు శానిటైజర్లను చేతుల్లోకి తీసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. 2011నుంచి 2015 మధ్య కాలంలో తమ పిల్లలు హ్యాండ్‌ శానిటైజర్‌ మింగారంటూ ‘యూఎస్‌ పాయిజన్‌ కంట్రోల్‌ సెంటర్‌’లకు 85వేల ఫోన్‌ కాల్స్‌ రావటం గమనార్హం.