Coronavirus (COVID-19): బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

New Delhi, August 29: కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది (coronavirus disease (COVID-19) మరింతగా భయపెడుతోంది. దీనిపై శాస్ర్తవేత్తలు రోజుకొక కొత్త ఆసక్తిర విషయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా మరొక వార్త బయటకు వచ్చింది. కోవిడ్‌–19 (Coronavirus (COVID-19) బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు (Obesity) 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

అధిక బరువు కలిగిన వారు 113 శాతం ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉండగా, వారిలో 74 శాతం మంది ఆక్సిజన్‌ వెంటిలేటర్లను ఆశ్రయించాల్సి వస్తుందని కూడా ఆ బృందం హెచ్చరించింది. కోవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌లు (Coronavirus Vaccine) కూడా వారికి పెద్దగా పని చేయవని ఆ బందం పేర్కొంది. అధిక బరువు కలిగిన వారిలో రోగ నిరోధ వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం వల్లనే వ్యాక్సిన్ల ప్రభావం (Coronavirus Vaccine Update) వారిపై ఎక్కువగా ఉండదని శాస్త్రవేత్తల బందం తెలిపింది.

షుగర్‌ పెరిగితే రక్తం గడ్డలు కట్టే ప్రమాదం

అధిక బరువు కలిగిన వారికి మధుమేహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దానివల్ల వారి రక్తంలో షుగర్‌ పెరిగితే రక్తం గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, పైగా వారి రక్తనాళాలు ఉబ్బిపోయి పెలుసుగా తయారవుతాయని, అధిక బరువు కలిగిన వారిలో రోగనిరోధక శక్తినిచ్చే కణాలు కూడా దెబ్బతింటాయని, అధిక బరువు కారణంగా వారికి వెంటిలేటర్‌ చికిత్స ఇవ్వడం కూడా కష్టం అవుతుందని, ఇలాంటి కారణాల వల్లనే అధిక బరువు కలిగిన వారు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం తెలియజేసింది. పిల్లలకు, టీనేజర్లకు కరోనా ముప్పు ఎక్కువ

కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణం

ఇక కోవిడ్‌–19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది. ఆరు అడుగుల భౌతిక దూరం ఇప్పుడు సరిపోదని ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. వైరస్‌ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ సర్వే తేల్చింది. 26 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ ఉన్న కేసులు 7,52,424 మాత్రమే

అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్‌ఫార్డ్‌ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడైంది. తాజా అధ్యయనంలో 26 అడుగుల వరకు తుంపర్లు ప్రయాణిస్తాయని వెల్లడి కావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మహిళల్లో కంటే పురుషులకే వైరస్‌ ముప్పు ఎక్కువ

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19 గణాంకాల ను పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషులకే వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ బాప్టిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు అన్వేషించారు. వారి పరిశోధనల్లో మహిళల్లో సెక్స్‌ హార్మోన్‌ ఈస్ట్రోజన్‌ వల్ల వైరస్‌ సోకే ముప్పు తక్కువగా ఉందని తేలింది. కరోనా వైరస్‌ సోకితే గుండె మీద తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే కారణమా? 

అదే విధంగా కరోనా వైరస్‌ ప్రభావం నేరుగా గుండెపై పడకుండా ఈస్ట్రోజ న్‌ అడ్డుపడు తుందని, దీంతో వైరస్‌ సోకినా మహి ళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ లియాన్నె గ్రోబన్‌ చెప్పారు. తాము చేసిన అధ్యయనం కోవిడ్‌ చికిత్సకి పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

 కరోనావాక్‌కు అనుమతిచ్చిన చైనా 

సినోవాక్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ కరోనావాక్‌కు జులైలోనే చైనా అత్యవసర వాడకానికి అనుమతించింది. వైద్య సిబ్బంది వంటి హైరిస్క్‌ గ్రూపులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనావ్యాక్సిన్‌ అత్యవసర వాడకానికి తమకు కూడా అనుమతి లభించిందని చైనా జాతీయ ఫార్మస్యూటికల్‌ గ్రూప్‌నకు చెందిన చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ (సీఎన్‌బీజీ) కూడా సోషల్‌ మీడియా వేదిక విచాట్‌లో పేర్కొంది. సీఎన్‌బీజీ అభివృద్ధి చేస్తున్న రెండు కరోనా వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షల్లో ఉండగా ఏ వ్యాక్సిన్‌కు అత్యవసర వాడకానికి చైనా అనుమతించిందనేది ఆ సంస్థ వెల్లడించలేదు.

ఇళ్లలోని పెద్దవారిపై దాని ప్రభావం తీవ్రం

యువతలో కరోనా విజృంభిస్తే, వారి ఇళ్లలోని పెద్దవారిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఫలితంగా మరణాలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని, కోవిడ్‌–19 సుడిగాలిలాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) యూరప్‌ చీఫ్‌ డాక్టర్‌ హన్స్‌ క్లూగ్‌ వెల్లడించారు. యువతరం కారణంగా కచ్చితంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుతోందన్నారు.

 రెండోసారి కరోనా సోకుతుందా అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు

కరోనా వైరస్‌ సోకిన వారికి తిరిగి మళ్ళీ రెండోసారి కరోనా సోకుతుందా అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా దీనిపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకవేళ అదేజరిగితే వ్యాక్సిన్‌ కార్యక్రమంపై కూడా దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూకే కేంద్రంగా పనిచేస్తోన్న భారతసంతతికి చెందిన డాక్టర్‌ అసీమ్‌ మల్హోత్రా 21 రోజుల ఇమ్యూనిటీ ప్లాన్‌ని అభివృద్ధి పరిచి, కరోనా వైరస్‌ని ఎదుర్కొనేలా శరీరాన్ని సంసిద్ధం చేయడానికి పుస్తకరూపంలో పొందుపరిచిన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఓజోన్‌ గ్యాస్‌ కరోనా వైరస్‌ కణాలను తటస్తం చేయగలదట

కరోనాపై జపాన్‌ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్‌ గ్యాస్‌ కరోనా వైరస్‌ కణాలను తటస్తం చేయగలదని తెలిపారు. అందువల్ల ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు వంటి ప్రదేశాల్లో దీన్ని డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌గా ఉపయోగించాలని సూచిస్తున్నారు.  రోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్‌ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు

ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఓజోన్ వాయువు 0.05 నుంచి 0.1 పీపీఎం, మానవులకు హానిచేయనిదిగా భావించే స్థాయి వైరస్‌ని చంపగలదని గుర్తించాము అన్నారు. ఈ ప్రయోగంలో వారు కరోనా వైరస్ నమూనా ఉన్న కలిగిన మూసివున్న గదిలో ఓజోన్ జనరేటర్‌ను ఉపయోగించారు. దాదాపు 10 గంటల పాటు తక్కువ సాంద్రత గల ఓజోన్‌ గ్యాస్‌ను ఉపయోగించడం వలన.. వైరస్‌ శక్తి 90 శాతం తగ్గినట్లు గుర్తించామన్నారు. ఓజోన్, ఒక రకమైన ఆక్సిజన్ అణువు. ఇది అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుంది. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత కల ఓజోన్‌ వాయువు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుందన్నారు.

భౌతిక దూరానికి రాంరాం

ముఖానికి మాస్కులు ధరించడం అలవాటు చేసుకున్న ప్రజలంతా మళ్లీ సామాజిక లేదా భౌతిక దూరం పాటించడానికి సుముఖంగా లేరని లండన్‌లోని వార్‌విక్‌ బిజినెస్‌ స్కూల్‌ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. మరోసారి కరోనా వైరస్‌ రెండోసారి దాడి చేసినట్లయితే ప్రజలతో భౌతిక దూరం పాటించేలా చేయడం చాలా కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మాస్కులు ధరిస్తుండడం వల్ల లండన్‌లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని, ఆ విషయం వారి భరోసా పెంచి ఉంటుందని వారంటున్నారు. కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి

కానీ మాస్కులు, భౌతికదూరం, చేతుల శుభ్రత అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తున్న వారిలో మాస్కులు ధరిస్తున్న వారే ఎక్కువగా ఉండడం సర్వేలో బయటపడిన మరో విశేషంగా చెప్పుకోవాలి.

లక్షణాలు లేకుంటే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు వద్దు 

కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం అవసరంలేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలను సవరించింది. కరోనా సోకిన వ్యక్తులతో కలిసి సంచరించినవారు.. తమలో లక్షణాలు కనిపించనప్పటికీ కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని గతంలో సీడీసీ సూచించింది. ప్రస్తుతం వీటిని సవరించింది. తాజా మార్గదర్శకాలు ప్రజల్లో తప్పుడు భావనను కలిగించే అవకాశమున్నదని శ్వేతసౌధం కరోనా కార్యదళం సభ్యుడు ఆంటోనీ ఫౌసీ చెప్పారు.

హెర్డ్‌ ఇమ్యునిటీ కోసం సహజంగా ప్రయత్నించడం అనేది ప్రమాదకరం

కరోనా బారినుంచి తప్పించుకునేందుకు హెర్డ్‌ ఇమ్యునిటీ కోసం సహజంగా ప్రయత్నించడం అనేది ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఆ లోపు అనేకమంది చనిపోతారని డబ్ల్యూహెచ్‌వోలో కొవిడ్ -19 టెక్నికల్ లీడ్ మేరియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు. టీకా ఒక్కటే సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన మార్గం అని వెల్లడించారు. ‘జనాభాలో ఎక్కువ మందికి రక్షణ కల్పించే సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ వల్ల వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం లేదు.

అయితే, హెర్డ్‌ ఇమ్యునిటీకి చేరుకునేందుకు సహజంగా ప్రయత్నిస్తే చాలా మంది చనిపోతారు’ అని వాన్ కెర్ఖోవ్ తెలిపారు. జనాభాలో కనీసం మూడింట రెండొంతుల మంది రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానికి టీకా ఒక్కటే మార్గమని వెల్లడించారు. జనాభాలో 65 నుంచి 70 శాతం మందిలో రోగనిరోధక శక్తిని పెంపొందించాలంటే వ్యాక్సిన్‌తోనే సాధ్యమని తెలిపారు.