Coronavirus Cases in India: 105 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, దేశంలో 24 గంటల్లో 52,123 మందికి కోవిడ్-19 పాజిటివ్, ప్రపంచవ్యాప్తంగా 1.69 కోట్లు దాటిన కరోనావైరస్ కేసులు
ఒక్కరోజు వ్యవధిలోనే 775 మంది చనిపోయారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు (Coronavirus Deaths in India) పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఈనెల 29 వరకు 1,81,90,382 కోవిడ్-19 శాంపిల్స్ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 4,46,642 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది.
New Delhi, July 30: భారత్‌లో గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus Cases in India) నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలోనే 775 మంది చనిపోయారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు (Coronavirus Deaths in India) పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఈనెల 29 వరకు 1,81,90,382 కోవిడ్-19 శాంపిల్స్ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 4,46,642 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది. బార్లకు నో పర్మిషన్, ఆగస్టు 31 వరకు విద్యా సంస్థల మూసివేత, రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ఎత్తివేత, అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల (Coronavirus Cases in Maharashtra) దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఆగస్టు 31 వరకు పొడిగించాలని రాష్ట్రంలోని ఉద్ధవ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ బిగిన్ ఎగైన్ కింద మినహాయింపులు మంజూరు చేసినప్పటికీ, ఆగస్టు 5 నుంచి రాష్ట్రంలో మాల్స్, మార్కెట్ కాంప్లెక్సులు తెరవనున్నారు. అయితే థియేటర్లు, ఫుడ్ కోర్టుల మూసివేత కొనసాగుతుంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. గడచిన 24 గంటల్లో 9,211 కొత్త కేసులు నమోదయ్యాయి. 298 మంది మృతిచెందారు.
రాష్ట్రంలో మొత్తం 4,00,651 కరోనా కేసులు నమోదయ్యాయి. 14,463 మంది మృతి చెందారు. 1,46,129 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం 7,478 మంది బాధితులు కోలుకుని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స పొందిన తర్వాత ఇప్పటివరకు 2,39,755 మంది కోలుకున్నారు. అదే సమయంలో ముంబైలో గత 24 గంటల్లో 1,109 కొత్త కేసులు నమోదయ్యాయి. 60 మంది మృతిచెందారు. ఇక దేశ ఆర్థిక రాజధానిలో మొత్తంమీద 1,11,991 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,247 మంది ప్రాణాలు కోల్పోయారు. భయపెడుతున్న మురికివాడలు, పెరుగుతున్న రికవరీ రేటు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య (Global Coronavirus Cases) 1.69 కోట్లు దాటగా, మరణాల సంఖ్య 6.64 లక్షలు (Global Coronavirus Deaths) దాటింది. ఇదిలా ఉంటే చైనా బుధవారం 100కి పైగా కరోనా కేసులను ధృవీకరించింది. చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతం ఇప్పటికీ కరోనా ప్రభావితమైవుందని తెలుస్తోంది. కొత్త కేసుల్లో 89 కేసులు ఈ ప్రాంతం నుంచే నమోదయ్యాయి. గత 24 గంటల్లో చైనాలో 101 కరోనా కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 44.98 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1.52 లక్షలను దాటింది. ఇదిలా ఉండగా మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాలో తయారయ్యే వ్యాక్సిన్ ఇతర దేశాలకు కూడా అందుబాటులోకి వస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. 2021 ప్రారంభంలో టీకాలు వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
రష్యా రెండవ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి హ్యూమన్ ట్రయిల్స్ ప్రారంభించింది. జూలై 27 న టీకా తీసుకున్న వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు.ఈ అంటువ్యాధి కారణంగా ఇటలీలో అక్టోబర్ 15 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. కరోనా కారణంగా దిగజారుతున్న పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ గడువును పొడిగిస్తున్నట్లు ఇటాలియన్ ప్రధానమంత్రి గ్యూసెప్ కోంటె ప్రకటించారు. ఇక్కడ లాక్‌డౌన్ గడువు జూలై 31తో ముగిసింది.
కేరళలోని కొల్లామ్‌కు చెందిన 105 ఏళ్ల బామ్మ కోవిడ్19 నుంచి కేవలం తొమ్మిది రోజుల్లో కోలుకున్నది. కొల్లామ్ మెడికల్ కాలేజీ సూపరిండెంట్ డాక్టర్ హబీబ్ నసీమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శ్వాసకోస ఇబ్బందులతో జూలై 20వ తేదీన ఆ బామ్మ హాస్పిటల్‌లో చేరింది. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో ఆమె కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అయితే మెడికల్ బోర్డు ఆ బామ్మకు ప్రత్యేక చికిత్స అందించింది. వారం రోజుల్లోనే తిరిగి ఆ వృద్ధురాలు కరోనా పరీక్షలో నెగటివ్‌గా తేలింది. బుధవారం రోజున ఆమెను డిశ్చార్జ్ చేశారు. బామ్మకు ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ సిబ్బందికి ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా కంగ్రాట్స్ తెలిపారు. కాగా కోవిడ్ నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలి జాబితాలో ఆమె మూడవ స్థానంలో నిలిచింది. 107 ఏళ్ల డచ్ మహిళ, 106 ఏళ్ల ఢిల్లీ మహిళ కూడా కరోనా నుంచి నుంచి కోలుకున్నారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఢిల్లీవాసి తబ్రేజ్ ఖాన్ ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడు . ఇతని కారణంగా 12 మంది ప్రాణాలు నిలబడ్డాయి. జహంగీర్‌పురికి చెందిన ఇతను ఏప్రిల్ నెలలో కరోనా నుంచి కోలుకున్నాడు. అప్పటి నుంచి ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడు. ఢిల్లీలో తొలిసారి ప్లాస్మా దానం చేసిన వ్యక్తి ఇతనే. ‘ప్లాస్మా దానం చేసిన ప్రతిసారీ ఆస్పత్రి వర్గాలో, చికిత్స పొందిన వ్యక్తి కుటుంబమో ధన్యవాదాలు చెప్తూ నాకు మెసేజిలు వచ్చాయి’ అని తబ్రేజ్ చెప్పాడు.