COVID-19 lockdown (Photo Credit: PTI)

New Delhi, July 29: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో (Containment Zone) ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ (Coronavirus lockdown) ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్-3 (Unlock 3) మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం కొంత ఊరట లభించే విధంగా సడలింపులను ప్రకటించింది. ఇండియాలో 15 లక్షలు దాటిన కరోనావైరస్ కేసులు, భయపెడుతున్న మురికివాడలు, పెరుగుతున్న రికవరీ రేటు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

పాఠశాలలు, కళాశాలలు, విద్యా, కోచింగ్ సంస్థలు ఆగస్టు 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. రాత్రి సమయాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. బుధవారం సాయంత్రం కేంద్రం ఈ మేరకు అన్‌లాక్ 3 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుకానున్నాయి. ఆగస్ట్ 5 నుంచి యోగా ఇన్‌స్టిట్యూట్స్‌, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. అయితే.. కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. దీని కోసం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) త్వరలో జారీ చేయనున్నారు. రూ.59కే కరోనా యాంటీ డ్రగ్ ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్‌, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..

ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా అనుమతినిచ్చిన కేంద్రం భౌతిక దూరంతో పాటు ఇతర హెల్త్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని స్పష్టం చేసింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు పరిమిత సంఖ్యలో అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది. అయితే.. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నడిపేందుకు, సినిమా హాల్స్‌ తెరిచేందుకు అనుమతి లేదని తెలిపింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ప్రకారం అంతర్జాతీయ విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ప్రాణ హాని ఉందని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ, ప్రపంచ పులుల దినోత్సవం సంధర్భంగా అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..

స్విమ్మింగ్ పూల్స్‌కు, పార్కులకు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ పైన పేర్కొన్న వాటిలో పరిస్థితిని అంచనా వేసి దశలవారీగా అనుమతినివ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

మార్గదర్శకాలు

స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత

ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లకు అనుమతి

సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్స్‌, మెట్రో రైలు‌ మూసివేత కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది)

సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు

కంటైన్‌మెంట్‌ జోన్లలో అంక్షలు కొనసాగింపు

భౌతిక దూరం, వైద్య నిబంధనలు పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు.

సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది)

వీటికి అనుమతి..

రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేశారు.

జిమ్ లు, యోగా కేంద్రాలు ఆగస్ట్ 5 నుంచి తెరుచుకోవచ్చు.

భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు.

వీటికి అనుమతి లేదు..

కంటైన్మెంట్ జోన్లలో ఆగస్ట్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది.

స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంబంధ సంస్థలు ఆగస్టు 31 వరకు తెరువకూడదు.

మెట్రో రైళ్లు నడపడంపై నిషేధం కొనసాగుతుంది.

బార్లు ఎప్పటిమాదిరిగానే మూసివుంచాలి.