India COVID-19: దేశంలో 70 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, గత 24 గంటల్లో 3604 కొత్త కేసులు, దేశ వ్యాప్తంగా 2293 మంది కరోనాతో మృతి
మంగళవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య (Coronavirus Count in India) 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా, కొత్తగా 87 మంది బాధితులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య (Coronavirus Deaths) 2293కి చేరింది. ఈ వైరస్ బారిన పడినవారిలో 22,455 మంది బాధితులు కోలుకోగా, మరో 46,008 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ సగటున రోజుకు 1073 కేసులు నమోదవగా, మే తొలి 11 రోజుల్లో 3409 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో రికవరీ రేటు31.15 శాతానికి పెరిగింది.
New Delhi, May 12: దేశంలో కరోనా తీవ్రత (India COVID-19) రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య (Coronavirus Count in India) 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా, కొత్తగా 87 మంది బాధితులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య (Coronavirus Deaths) 2293కి చేరింది. రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్
ఈ వైరస్ బారిన పడినవారిలో 22,455 మంది బాధితులు కోలుకోగా, మరో 46,008 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ సగటున రోజుకు 1073 కేసులు నమోదవగా, మే తొలి 11 రోజుల్లో 3409 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో రికవరీ రేటు31.15 శాతానికి పెరిగింది.
తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 23,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 868 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 8,542 పాజిటివ్ కేసులు ఉండగా, 513 మంది మృతి చెందారు. తమిళనాడులో 8,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందారు. అలాగే ఢిల్లీలో 7,233 పాజిటివ్ కేసులు, 73 మంది మృతి చెందారు. రాజస్తాన్‌లో 3,988 పాజిటివ్ కేసులు, 113 మంది మృతి చెందారు.
Here's the COVID-19 Tally State-wise in India:
S. No. | Name of State / UT | Total Confirmed cases* | Cured/Discharged/Migrated | Deaths** |
1 | Andaman and Nicobar Islands | 33 | 33 | 0 |
2 | Andhra Pradesh | 2018 | 975 | 45 |
3 | Arunachal Pradesh | 1 | 1 | 0 |
4 | Assam | 65 | 34 | 2 |
5 | Bihar | 747 | 377 | 6 |
6 | Chandigarh | 174 | 24 | 2 |
7 | Chhattisgarh | 59 | 53 | 0 |
8 | Dadar Nagar Haveli | 1 | 0 | 0 |
9 | Delhi | 7233 | 2129 | 73 |
10 | Goa | 7 | 7 | 0 |
11 | Gujarat | 8541 | 2780 | 513 |
12 | Haryana | 730 | 337 | 11 |
13 | Himachal Pradesh | 59 | 39 | 2 |
14 | Jammu and Kashmir | 879 | 427 | 10 |
15 | Jharkhand | 160 | 78 | 3 |
16 | Karnataka | 862 | 426 | 31 |
17 | Kerala | 519 | 489 | 4 |
18 | Ladakh | 42 | 21 | 0 |
19 | Madhya Pradesh | 3785 | 1747 | 221 |
20 | Maharashtra | 23401 | 4786 | 868 |
21 | Manipur | 2 | 2 | 0 |
22 | Meghalaya | 13 | 10 | 1 |
23 | Mizoram | 1 | 1 | 0 |
24 | Odisha | 414 | 85 | 3 |
25 | Puducherry | 12 | 6 | 0 |
26 | Punjab | 1877 | 168 | 31 |
27 | Rajasthan | 3988 | 2264 | 113 |
28 | Tamil Nadu | 8002 | 2051 | 53 |
29 | Telengana | 1275 | 800 | 30 |
30 | Tripura | 152 | 2 | 0 |
31 | Uttarakhand | 68 | 46 | 1 |
32 | Uttar Pradesh | 3573 | 1758 | 80 |
33 | West Bengal | 2063 | 499 | 190 |
Total number of confirmed cases in India | 70756# | 22455 | 2293 |
మధ్యప్రదేశ్‌లో 3,785 పాజిటివ్ కేసులు, 221 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో 3,573 పాజిటివ్ కేసులు, 80 మంది మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌లో 2,063 పాజిటివ్ కేసులు, 190 మంది మృతి చెందారు. పంజాబ్‌లో 1,877 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి చెందారు. జమ్మూకశ్మీర్‌లో 879 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి చెందారు. కర్ణాటకలో 862 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి చెందారు. హర్యానాలో 730 పాజిటివ్ కేసులు, 13 మంది మృతి చెందారు. తెలంగాణలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు, కొత్తగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనివే, రాష్ట్రంలో 1275కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య
భారతదేశం ప్రస్తుతం కొనసాగుతున్న మూడవ దశ లాక్డౌన్ మధ్యలో ఉంది. ఇది మే 17 తో ముగుస్తుంది. పిఎం నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి, లాక్డౌన్ నిష్క్రమణ వ్యూహం మరియు ఎలా చేయాలో చర్చించారు. అలాగే లాక్డౌన్ యొక్క పొడిగింపు ఉంటుందని నరేంద్ర మోడీ సీఎంలతో అన్నట్లుగా తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ 4లో గత దానికంటే సడలింపులు ఎక్కువగా ఉండవచ్చు.