COVID-19 in India: గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్
భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ప్రతి రోజూ పదకొండు వేల మార్కును దాటుతున్నాయి. . గత 24 గంటల్లో దేశంలో 11,502 కేసులు రికార్డు అయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్ (Coronavirus in India) ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ బ్రిటన్‌ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 325 మంది మృతి చెందారు.
New Delhi, June 15: భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ప్రతి రోజూ పదకొండు వేల మార్కును దాటుతున్నాయి. . గత 24 గంటల్లో దేశంలో 11,502 కేసులు రికార్డు అయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్ (Coronavirus in India) ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ బ్రిటన్‌ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 325 మంది మృతి చెందారు. కోవిడ్ చికిత్సకు హార్ట్ ఎటాక్ తెప్పించే బిల్లు! కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడికి రూ. 8,52,61,811 బిల్లు వేసిన ఆసుపత్రి, నవ్వులు పోయి నువ్వులైన వేళ ఊరటనిచ్చిన ఆరోగ్య బీమా
కాగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,53,106 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1,69,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతానికి చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య (Coronavirus Death Toll) 9520కి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 3,32,424కు చేరుకుంది.
భారత్‌లో కరోనా వ్యాప్తి నవంబర్ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో విధించిన 8 వారాల లాక్‌డౌన్‌తోపాటు ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను పెంచడం వల్ల ఈ గరిష్ట స్థాయి అనేది 34 నుంచి 76 రోజులు వెనక్కి జరుగుతున్నట్లు తేలింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరితే బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత తప్పకపోవచ్చని అధ్యయనం వెల్లడించింది. అందుకే ఇప్పటినుంచే అప్రమత్తం కావడం మంచిదని సూచించింది.