Coronavirus Outbreak in India: 640మంది కరోనాతో మృతి, ఇండియాలో 19 వేలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజులోనే 1883 కేసులు నమోదు
కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1883 కేసులు నమోదైనట్లు తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,984కు చేరింది.
New Delhi, April 22: భారత్‌లో కోవిడ్-19 వైరస్ (Coronavirus Outbreak in India) విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1883 కేసులు నమోదైనట్లు తెలిపింది. 24 గంటల్లో 35 కొత్త కేసులు, ఏపీలో 757కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,984కు చేరింది. ఇందులో 3,870 మంది కరోనా వైరస్ (Coronavirus) నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 640 మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం యాక‍్టివ్ కేసులు 15,474 ఉన్నాయి.
మహారాష్ట్రలో 5,218 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 2,178 కరోనా కేసులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. కేరళలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే అక్కడ కోవిడ్ 19 (COVID 19) పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. తెలంగాణలో 928కు చేరిన కోవిడ్-19 కేసులు, ఈరోజు కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు
రాజస్థాన్‌లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 12 గంటల వ్యవధిలోనే 64 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు సంఖ్య 1,799కి చేరింది. వారిలో 97 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 26 మంది మృతిచెందారు. ఇక జిల్లాల వారీగా చూస్తే జైపూర్‌లో అత్యధికంగా 661 కేసులు, జోధ్‌పూర్‌లో 279 కేసులు నమోదయ్యాయని రాజస్థాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అజ్మీర్, భరత్‌పూర్, కోటా, టోంక్ జిల్లాల్లో 100కు పైగా కేసుల చొప్పున నమోదైనట్లు వెల్లడించారు.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ బందీపోరా జిల్లాలోని ఓ గ్రామంలో 30 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొహల్లా అనే గ్రామాన్ని వైద్యాధికారులు, పోలీసులు నిర్బంధం చేశారు. గ్రామంలోని 400 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో మొహల్లా గ్రామం.. అతిపెద్ద కరోనా వైరస్ హాట్‌స్పాట్ గ్రామంగా మారింది. మొహల్లా గ్రామానికి సమీపంలో ఉన్న మరో నాలుగు గ్రామాలను కూడా రెడ్ జోన్లుగా పోలీసులు ప్రకటించారు. బందీపోరా జిల్లాలో మొత్తం 91 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,552కు చేరింది. ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారు. 148 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇండోర్ లో కంటైన్‌మెంట్ జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కరోనా సోకింది. మొత్తం 12 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కరోనాతో చనిపోయారు. మిగతా 11 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ 11 మందితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు సేకరించి.. వారిని క్వారంటైన్‌కు తరలించారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 25.55 లక్షలు దాటాయి. 1.77 లక్షల మంది మృతి చెందగా, 6.90 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 8.18 లక్షలు దాటగా, నిన్న ఒక్కరోజే 25,607 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2, 782మంది మరణించారు.