Amaravati, April 22: ఏపీలో కరోనా వైరస్ (AP Coronavirus) రోజు రోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 35 పాజిటివ్ కేసులు (COVID19 positive cases) నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది.ఏపీలో లాక్‌డౌన్ ఉల్లంఘన, ఎమ్మెల్యే రోజాకు పూలతో స్వాగతం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
కరోనా (Coronavirus) మహమ్మారితో ఇవాళ మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో కోలుకుని 96 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాపై తాజా కేసులకు సంబంధించిన బులిటెన్‌ను ప్రభుత్వం (AP Govenment) విడుదల చేసింది.
ఇవాళ నమోదయిన కేసుల్లో కొత్తగా కర్నూలు జిల్లాలో 10, గుంటూరు జిల్లా 9, కడప జిల్లా 6, ప.గో జిల్లా 4, అనంతపురం జిల్లా 3, కృష్ణా జిల్లా 3 కేసులు నమోదయ్యాయి. అటు చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఇవాళ మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే... అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో అత్యధికంగా 184 కేసులు నమోదు అయ్యాయి.ఆ తర్వాత స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. అక్కడ 158 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. నెల్లూరులో 67, చిత్తూరులో 53, ప్రకాశంలో 44 కేసులు నమోదు అయ్యాయి.
Here's ArogyaAndhra Tweet
#CovidUpdates: 35 new #COVID19 positive cases reported in the state in the past 24 hours. Total number of positive cases: 757; Discharged: 96, Deceased: 22, Active Cases: 639#APFightsCorona #COVID19Pandemic
— ArogyaAndhra (@ArogyaAndhra) April 21, 2020
కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. వైరస్ నిర్ధారణ పరీక్షల సామర్ధ్యాన్ని రోజురోజుకూ పెంచుకుంటోంది. రాష్ట్రంలో ప్రతీరోజూ గణనీయంగా కరోనా పరీక్షల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈక్రమంలో ప్రతి 10 లక్షల మందిలో 715 మందికి పరీక్షలు చేస్తూ కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రతి 10 లక్షల మందిలో 830 మందికి పరీక్షలు చేస్తూ రాజస్తాన్ తొలి స్థానంలో కొనసాగుతోంది.
ఇక వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భారతదేశ సగటు 10 లక్షలకు 290 మాత్రమే ఉండటం గమనార్హం. అత్యధిక కేసులున్న రాష్ట్రాలకంటే అధిక పరీక్షలు చేస్తూ ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కంటే రాష్ట్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరగుతున్నాయి. ఒక్కరోజులోనే 615 నుంచి 715 కి కరోనా నిర్ధారణ పరీక్షల్లో పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 5022 మందికి పరీక్షలు చేశారు. అన్ని జిల్లాలకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల సరఫరా పూర్తైనందున పరీక్షల సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రతీ మండలంలోనూ ర్యాండమ్ పరీక్షలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.