AP Lockdown Violation: ఏపీలో లాక్‌డౌన్ ఉల్లంఘన, ఎమ్మెల్యే రోజాకు పూలతో స్వాగతం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
YSRCP MLA Roja Violates Lockdown Rules Amid Surge In COVID-19 Cases (photo-Twitter)

Amaravati, April 21: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ రోజు రొజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ (Nationwide Lockdown) విధించిన విషయం విదితమే. అలాగే దాన్ని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కూడా లాక్ డౌన్ (Coronavirus lockdown) పటిష్టంగా అమలు చేస్తోంది. అయితే ఎంత పటిష్టంగా అమలు చేసినా అక్కడక్కడా లాక్ డౌన్ ఉల్లంఘనలు (AP Lockdown Violation) జరుగుతున్నాయి.

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా (YSRCP MLA Roja) లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. లాక్ డౌన్ పై ఆమె వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏపీకి, తెలంగాణకు కొత్త జడ్జీలు, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం, వీరిలో ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒకరు

పుత్తూరు సుందరయ్యనగర్ లో బారుబావి ప్రారంభోత్సవానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమె నడుస్తుండగా పాదల కింద పూలు చల్లుతున్నారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు కూడా రోజా వెంట ఉన్నారు.  ఏపీకి నయా ఎస్‌ఈసీ, నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

Here's Video

అలా జనం పూల వర్షం కురిపిస్తుంటే ఆ బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లారు. అనంతరం గ్రామస్తులు భారీ పూల దండను ఎమ్మెల్యే మెడలో వేసి సత్కరించారు. ఆ తర్వాత స్విచాన్ చేసి.. బిందెలో నీళ్లు పట్టి బోరుబావిని ప్రారంభించారు. ఆమె ప్రారంభించిన మరుక్షణమే జనాలంతా బిందెల్లో నీళ్లు పట్టుకున్నారు. సత్తెనపల్లి యువకుడి మరణంపై ఏపీ పోలీస్ ట్వీట్, సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్, కేసు నమోదు చేసిన విచారణకు ఆదేశించిన డీజీపీ

సోషల్ మీడియాలో రోజాకు సంబంధించిన ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. కాగా లాక్ డౌన్ వేళ రోజా నిబంధనలు ఉల్లంఘించారంటే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో కరోనా విజృంభిస్తోందని.. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని చెప్పాల్సింది పోయి, ఇలా చేస్తారా..? అంటూ మండిపడుతున్నారు.

కర్నూలు, గుంటూరులో పెరుగుతున్న కేసులు, ఏపీలో తాజాగా 75 కొత్త కేసులు, 20కి చేరిన మరణాల సంఖ్య, రాష్ట్రంలో 722కి చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా చేతి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. గ్రామ ప్రజలు కూడా కొంత సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్‌లు ధరించారు. ఐతే లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఈ సమయంలో.. ఇంత చిన్న కార్యక్రమానికి అంత హడావిడి, హంగు ఆర్భాటాలు చేయలా..? అని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,892 కోట్లు మరియు తెలంగాణకు రూ. 982 కోట్లు మంజూరు

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే వైసీపీ వర్గాలు మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నాయి. సామాజిక దూరం పాటిస్తూనే... ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎదురుదాడికి దిగుతున్నారు.

Here's YCP MLA Madhusudan rally 

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ వేళ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తీరు కూడా వివాదాస్పదంగా మారింది.కరోనా నివారణకు విరాళాలు ఇచ్చిన వారి ఫొటోలను ట్రాక్టర్లపై పెట్టి భారీ ర్యాలీతో ప్రచారం చేశారు. వీరిలో పోలీసు, మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా స్థానికులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. అయితే తాజాగా ఈ ర్యాలీలో పాల్గన్న 25మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.