Amaravati, April 21: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో (sattenapalli) పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ యువకుడు ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. పట్టణంలోని టింబర్ డిపో నిర్వాహకుడు షేక్ మహ్మద్ గౌస్(35) (Shaik Mahmood Gouse) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్ పోస్టు వద్ద ఎస్‌ఐ రమేశ్ (sattenapalli SI Ramesh) ఆపి మందలించారు. ఏపీకి, తెలంగాణకు కొత్త జడ్జీలు, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
లాఠీకి పనిచెప్పడంతో ఆ యువకుడు కిందపడిపోయాడు. పైగా అతను హృద్రోగి కూడా కావడంతో తండ్రి షేక్ మహ్మద్ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందాడు.దీంతో ఆగ్రహించిన స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున నిరసన కు దిగారు. పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. కర్నూలు, గుంటూరులో పెరుగుతున్న కేసులు, ఏపీలో తాజాగా 75 కొత్త కేసులు, 20కి చేరిన మరణాల సంఖ్య, రాష్ట్రంలో 722కి చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య
ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ, ఆ ప్రాంతంలో రెడ్ జోన్ (Red Zone) అమలులో ఉన్నందున కంటైన్ మెంట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నామని స్పష్టం చేశారు. గౌస్ ను పోలీసులు ఆపిన సమయంలో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ను చూపించలేదని తెలిపారు. అతనికి వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ సంఘటనకు కారణమైన ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు గుంటూరు రేంజి ఐజి జె ప్రభాకరరావు ప్రకటించారు.
Here's AP Police Tweets
1/3: In an unfortunate incident in Guntur Rural district, Shaik Mohammed Ghouse died. Allegations were made against police. Pending enquiry SI D.Ramesh of Sattenapalli Town PS who had stopped the deceased at the Checkpost has been suspended..
— AP Police (@APPOLICE100) April 20, 2020
2/3: deceased suffered from cyanotic congenital heart disease since childhood & was operated & implanted with stents. No physical injuries have been found on the body. Enquiry/Inquest has been conducted by Sub Div Magistrate. Post Mortem conducted by team of docs & videographed..
— AP Police (@APPOLICE100) April 20, 2020
3/3: the written complaint by father mentions no allegations against police. Case has been registered & is being investigated. Parallely DGP has ordered departmental enquiry also. All procedures as per SC guidelines are being followed. The unfortunate demise is regretted.
— AP Police (@APPOLICE100) April 20, 2020
రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావుతో కలిసి మాట్లాడుతూ గౌస్‌కు గుండె సంబంధిత సమస్య ఉందని, చికిత్స కూడా తీసుకుంటున్నాడని తెలిపారు. డీజీపీ ఆదేశాలతో అసహజ మరణం కింద కేసు నమోదు చేసి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు దాడి లాఠీచార్జి చేసినట్లు రుజువైతే కారణమైన ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Here's Sattenapalli MLA Rambabu response
Mr. A Rambabu, MLA Sattenapalli response to the incident. pic.twitter.com/RaCjn9t3aL
— Raja NS (@UrstrulyNSRaja) April 20, 2020
దీనిపై మంగళవారం ట్విటర్ ద్వారా ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. గుంటూరు రూరల్ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ మరణించారు. ఈ సంఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్ చేశాం. మరణించిన వ్యక్తి బాల్యం నుండి పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారు.
Here's Video
This after death of sheik mohammad gouse in sattenapalli near Guntur... Public there don't come out for few days as Many there don't have masks #Covid_19 pic.twitter.com/JzwoQaRrcG
— Shatagni Missile ✍ (@TeluguChegu) April 20, 2020
ఆపరేషన్ చేసి స్టెంట్లు అమర్చారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పంచనామాలో గుర్తించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డీజీపీ డిపార్ట్‌మెంటల్ విచారణకు కూడా ఆదేశించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని విధానాలు పాటిస్తున్నాము’ అని ట్విటర్‌లో వివరించారు.