New Judges for AP & TS High Court: ఏపీకి, తెలంగాణకు కొత్త జడ్జీలు, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం, వీరిలో ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒకరు
AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati,April 21: రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు పేర్లను సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఏపీ రాష్ట్ర హైకోర్టుకు (Andhra Pradesh High Court) కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు (New Judges in AP & TS) రానున్నారు. అలాగే తెలంగాణ హైకోర్టుకు (Telangana High Court) ఒక జడ్జీ రానున్నారు. ఏపీకి నయా ఎస్‌ఈసీ, నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

ఏపీ హైకోర్టుకు న్యాయవాదులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. మొత్తం ఆరుగురి పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో కృష్ణమోహన్, సురేష్‌ రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్‌రెడ్డి, జీఎల్‌ నర్సింహారావు, కె.మన్మథరావు ఉన్నారు. ఈ జాబితాపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన కొలీజియం ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపింది.ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని (B Vijaysen Reddy) సిఫార్సు చేసింది. సోమవారం సమావేశమైన సుప్రీం కోర్టు కొలీజియం ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి సంబంధించి చర్చించింది. అనంతరం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. సుప్రీం కొలీజియం ప్రతిపాదనల ఆధారంగా ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

కాగా, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలు చర్చించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ఈ ఐదుగురితో కూడిన వ్యవస్థనే కొలీజియం వ్యవస్థగా పరిగణించారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించడానికి వీల్లేదు. చీఫ్ జస్టిస్ తప్పనిసరిగా కొలీజియం వ్యవస్థలోని ఇతర నలుగురు న్యాయమూర్తుల సలహాను కూడా పాటించాలి.

జడ్జిగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్‌ (Boppudi Krishna Mohan) గుంటూరులో 1965, ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లి దండ్రులు సావిత్రి, బీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, భార్య వసంత లక్ష్మి. కృష్ణమోహన్‌ 1988లో ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 1994లో సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా పనిచేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్యానెల్‌ అడ్వొకేట్లలో ఒకరిగా ఉన్నారు. 2019, జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఈయన.

కంచిరెడ్డి సురేష్‌రెడ్డి (K Suresh Reddy) అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో 1964, డిసెంబర్‌ 7న జన్మించారు. తండ్రి శంకర్‌రెడ్డి. తల్లి లక్ష్మీదేవమ్మ. అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. క్రిమినల్‌ లాలో మంచి పట్టు సాధించారు. హైకోర్టులో ఉన్న అతి తక్కువ మంది ఉత్తమ క్రిమినల్‌ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు.

కన్నెగంటి లలితకుమారి (Ms K Lalitha Kumari) గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జములపాళెంలో 1971, మే 5న జన్మించారు. తల్లి.. కె.అమరేశ్వరి, తండ్రి.. అంకయ్య చౌదరి. పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1994 డిసెంబర్‌ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ, దేవదాయ శాఖ, టీటీడీ, వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైస్సెస్‌ తదితర సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.