Coronavirus in India: రోజు రోజుకూ తగ్గుతున్న కరోనా కేసులు, మందగించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ, గణనీయంగా పడిపోయిన యాక్టీవ్ కేసుల సంఖ్య
రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 14.148 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 302 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,12,924కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది.
New Delhi Feb 24: భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 14.148 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 302 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,12,924కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 30,009 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,359 యాక్టీవ్ కేసులున్నాయి. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 1.22% శాతంగా ఉంది.
కేరళలో కూడా కరోనా తీవ్రత తగ్గుతోంది. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందగించినట్లు కనిపిస్తోంది. నిన్న దేశవ్యాప్తంగా కేవలం 30,49,988 కరోనా డోసులు మాత్రమే పంపిణీ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు 1,76,52,31,385 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. యువజనుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.