India Coronavirus: దేశంలో తాజాగా 16,311 మందికి కరోనా, 2,22,526 కేసులు యాక్టివ్‌, 1,51,160 మరణాలు, 1,04,66,595కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

భారతదేశంలో కరోనా (Coronavirus) కేసులు నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,66,595కు (Coronavirus Tally Reaches 1.04 Crore) చేరాయి. ఇందులో 1,00,92,909 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,22,526 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, January 11: భారతదేశంలో కరోనా (Coronavirus) కేసులు నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,66,595కు (Coronavirus Tally Reaches 1.04 Crore) చేరాయి. ఇందులో 1,00,92,909 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,22,526 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 1,51,160 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 19,299 మంది ఈ ప్రాణాంతక వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. కొత్తగా 161 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశంలో నిన్నటి వరకు 18,17,55,831 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. ఇందులో జనవరి 10న 6,59,209 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది. కాగా, కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి సోమవారం సాయంత్రం 4 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీకా పంపిణీకి ఏర్పాట్లు, విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వర్చువల్‌ విధానంలో ఈసమావేశం జరుగనుంది. ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభంకానుంది.

ఇండియాలో 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్, నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌, ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభం

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ ‌కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,558 కరోనా కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,69,114కు, మరణాల సంఖ్య 50,061కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 2,302 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,63,702కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,179 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement