PM Modi addressing the nation on coronavirus situation | (Photo Credits: DD News)

New Delhi, Jan 11: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యాచరణపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ (PM Narendra Modi's Meeting at 4 PM) నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి ఏ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారన్నది ఈ కాన్ఫెరెన్స్‌ తర్వాతే స్పష్టత వస్తుందని వెల్లడించారు.

టీకా పంపిణీకి ఏర్పాట్లు, విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో ( Chief Ministers) చర్చించనున్నారు. వర్చువల్‌ ద్వారా సమావేశం నిర్వహిస్తారు. వర్చువల్‌ విధానంలో ఈసమావేశం జరుగనుంది. ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభంకానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ (COVID-19 Vaccine) మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకాల్లో భాగంగా దేశవ్యాప్తంగా డమ్మి వ్యాక్సినేషన్‌ను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిం చారు. టీకా పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లతోపాటు, వ్యాక్సిన్‌ తీసుకునేవారిని కూడా గుర్తించారు. దేశంలో వచ్చే శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ మొదటి విడుత పంపిణీ ప్రారంభమవుతుంది.

మూడు కోట్ల మందికి తొలి దశలో వ్యాక్సిన్, జనవరి 16 నుంచి ప్రారంభం, దేశంలొ అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

దేశంలో తయారైన భారత్‌ బయోటెక్‌కు సంబంధించిన కోవ్యాక్సిన్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తిచేస్తున్న కొవీషీల్డ్‌ టీకాలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతించిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవడం ఇదే మొదటిసారి.

ఇండియాలో మరో డేంజరస్ మ్యూటేషన్ వైరస్, ఇది యుకె కొత్త స్ట్రెయిన్ కన్నా అత్యంత ప్రమాదకరం, ముంబైలో ముగ్గురికి E484K కరోనా మ్యూటేష‌న్

కాగా, కోవిన్‌ (కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) యాప్‌ ద్వారా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమన్వయం చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ చేసుకున్న 79 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ లబ్ధిదారులకు సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ అందించనున్నారు. వారిత్వరాత పోలీసులు, భద్రతా సిబ్బందికి పంపిణీ చేస్తారు. అనతరం 50 ఏండ్ల పైబడిన వయస్సున్న సుమారు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు.