COVID in Greek: వ్యాక్సిన్ వేసుకోలేదా..అయితే జరిమానా కట్టాల్సిందే, సంచలన నిర్ణయం తీసుకున్న గ్రీస్ ప్రభుత్వం, కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరం చేయాలని ఉత్తర్వులు
Coronavirus Outbreak: (Photo-IANS)

Greek, Jan 17: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అరవై ఏళ్ల వయసు నిండిన వారు కొవిడ్ టీకాలు వేయించుకోకుంటే వారికి సోమవారం నుంచి జరిమానాలు విధించాలని గ్రీస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ వ్యాక్సినేషన్ (COVID Vaccination) కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై ఒత్తిడిని తగ్గించేందుకు గ్రీస్ ప్రభుత్వం (Greek Govt) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

వృద్ధులకు కొవిడ్ టీకాలు వేయడానికి ఈ జరిమానాలు విధిస్తున్నామని గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిత్సోటాకిస్ చెప్పారు. ఇప్పటికీ టీకాలు వేయించుకోని వృద్ధులు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని కైరియాకోస్ కోరారు. కొవిడ్ టీకాలు వేయించుకోకపోతే ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. కొవిడ్ మరణాల్లో 10 మందిలో 9 మంది 60 ఏళ్ల వయసుకంటే ఎక్కువ వారున్నారు. ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల్లో 10 మందిలో ఏడుగురు కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారున్నారు.

గ్రీస్ దేశంలో 5,20,000 మంది వృద్ధులు కొవిడ్ టీకాలు వేయించుకోలేదని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. టీకాలు వేయించుకోని వృద్ధులకు నెలకు 100 యూరోల జరిమానా ( Greek Seniors Face Monthly Fine For Failure) విధిస్తామని గ్రీస్ అధికారులు చెప్పారు.జరిమానాను గ్రీక్ పన్ను అధికారులు వసూలు చేస్తారు. ఈ నిధులు కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు మళ్లించబడతాయి. యూరప్‌లోని గ్రీస్‌ దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా ఈ నెలలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి. కొవిడ్-సంబంధిత మరణాలు మునుపటి కంటే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవర్నీ ఒత్తిడి చేయడం లేదు, వారి అనుమతితోనే ఇస్తున్నాం, వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

శుక్రవారం దేశవ్యాప్తంగా మొత్తం 19,772 కొత్త కోవిడ్ -19 కేసులు నిర్ధారణ అయినట్లు గ్రీస్ (Greek) ప్రకటించింది, అయితే కరోనావైరస్‌తో బాధపడుతున్న 72 మంది గత 24 గంటల్లో మరణించారు.శుక్రవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1,632,641కి చేరుకుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 21,809 కోవిడ్-19 సంబంధిత మరణాలు అక్కడ నమోదయ్యాయి.