
New Delhi, Jan 17: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవర్నీ ఒత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛంధ అనుమతితోనే వ్యాక్సిన్లు (COVID Vaccination in India) ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దివ్యాంగులకు వ్యాక్సిన్ ధృవపత్రం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. వ్యాక్సిన్ సర్ఠిఫికేట్లు కలిగి ఉండాలని ఎక్కడా ఆదేశాలు ఇవ్వలేదని కోర్టుకు కేంద్రం (Center tell to Supreme Court) తెలిపింది.
కొన్ని రకాల సేవలు పొందేందుకు కొవిడ్ వ్యాక్సిన్ (COVID Vaccination) సర్టిపికేట్ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియచేసింది. ఎన్టీవో ఇవరా ఫౌండేషన్ వేసిన అభ్యర్ఖనకు బదులుగా కేంద్రం వివరణ ఇస్తూ.. వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరికీ వ్యాక్సిన్ ఇవ్వడం లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి సేవలు పొందడానికైనా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను తప్పనిసరి చేస్తూ ఇప్పటివరకు మార్గవర్శకాలేమి జారీ చేయలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వ్యక్తుల సమ్మతి లేకుండా టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
దేశంలో ఆగని కరోనా విశ్వరూపం, గత 24 గంటల్లో 2,58,089 మందికి కోవిడ్, నిన్న 358 మంది మహమ్మారితో మృతి
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవాలని సూచించినట్లు కేంద్రం తెలిపింది. ఇది అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన అని పేర్కొంది. అందుకోసం తగిన ఏర్పాట్లు కూడా చేశామని తెలిపింది. అంతేగాని బలవంతంగా వ్యాక్సిన్ ఇవ్వడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది.