Coronavirus in India: భారత్‌లో తగ్గిన కరోనా తీవ్రత, కేవలం 0.05 శాతం యాక్టీవ్ కరోనా కేసులు, త్వరలోనే 18 ఏళ్లు పైబడ్డవారందరికీ ప్రికాషన్ డోసులు పంపిణీ చేసే అవకాశం
యాక్టీవ్ కేసుల సంఖ్య దాదాపు 21 వేలకు చేరాయి. ఇక రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,685 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 83 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,16,755 కి చేరింది.
New Delhi, March 25: భారత్ లో కరోనా తీవ్రత భారీగా తగ్గింది. యాక్టీవ్ కేసుల సంఖ్య దాదాపు 21 వేలకు చేరాయి. ఇక రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,685 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 83 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,16,755 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 2,499 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,24,78,087 గా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,427 యాక్టీవ్ కేసులున్నాయి. యాక్టీవ్ కేసులశాతం 0.05 శాతంగా ఉంది. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 0.24% శాతంగా ఉంది.
12-14 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ (Vaccination) వేగంగా సాగుతోంది. ఇటీవల మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 55 లక్షల మందికి పైగా ఫస్ట్ డోసులు ఇచ్చినట్లు తెలిపింది. అటు ప్రికాషన్ డోసుల పంపిణీ కూడా వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
వ్యాక్సినేషన్‌లో మరో ముందడుగు వేసేందుకు కేంద్రం చూస్తోంది. 18 ఏళ్లు పైబడ్డవారందరికీ ప్రికాషన్ డోసులను పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తోంది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ మేరకు కేంద్రానికి సూచనలు పంపినట్లు తెలుస్తోంది.