Patna: బీహార్‌లో విషాదం, కలుషిత ఆహారం తిని 200 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత, చాలా మందికి కడుపులో వికారం, వాంతులు వంటి సమ్యలు
Representational Image (Photo Credits: ANI)

Patna, March 24: బీహార్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆహారం తిన్న (Lunch at Bihar Diwas Event) స్కూల్‌ విద్యార్థుల్లో 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 22న బీహార్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన వేడుకల్లో సీఎం నితీశ్‌ కుమార్‌ (Chief Minister Nitish Kumar) పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో మూడేండ్ల తర్వాత అట్టహాసంగా నిర్వహించిన బీహార్‌ దివస్‌ కార్యక్రమానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా పలు స్కూళ్లకు చెందిన వందలాది విద్యార్థులను కూడా ఆహ్వానించారు. అంతేగాక ఔరంగాబాద్‌ నుంచి కూడా 17 మంది స్కూల్‌ విద్యార్థులు తరలివచ్చారు

బీహార్‌ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ వద్ద ఆహారం తిన్న వందలాది విద్యార్థులు అనంతరం అస్వస్థతకు (Over 200 Students Hospitalised With Food Poisoning) గురయ్యారు. దీంతో వారిని పాట్నా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. మరోవైపు 156 మందికిపైగా విద్యార్థులు ఆసుపత్రిలో అడ్మిట్‌ అయినట్లు పాట్నా మెడికల్‌ కాలేజీకి చెందిన వైద్యురాలు విభా సింగ్ తెలిపారు.

మామ లైంగికంగా వేధించారని కోడలు క్రిమినల్ కేసు, ఈ ఆరోపణలు అత్యంత క్రూరమైనవని తెలిపిన ఢిల్లీ హైకోర్టు, పిటిషనర్ కేసును కొట్టివేసిన ధర్మాసనం

చాలా మందికి కడుపులో వికారం, వాంతులు వంటి సమ్యలున్నాయని చెప్పారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. తిన్న ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. దీనిపై దర్యాప్తు కోసం జిల్లా కలెక్టర్‌ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.