Coronavirus in India: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా, కొత్తగా 24,354 కోవిడ్ కేసులు నమోదు, బ్రిటన్ పౌరులు ఇండియాకు వస్తే పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం ఆదేశాలు
యాక్టివ్ కేసుల సంఖ్య 197 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,73,889 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,37,91,061కు (Coronavirus Scare) చేరింది. ఇప్పటివరకు 3,30,68,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
New Delhi, Oct 1: దేశంలో కొత్తగా 24,354 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 197 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,73,889 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,37,91,061కు (Coronavirus Scare) చేరింది. ఇప్పటివరకు 3,30,68,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,48,573గా ఉంది. దేశంలో కొత్తగా నమోదైన 24,354 కరోనా కేసుల్లో కేరళ నుంచే 13,834 కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో నిన్న 95 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారతీయులపై క్వారంటైన్ ఆంక్షలను విధించిన బ్రిటన్‌కు భారత్ షాక్ ఇచ్చింది. భారత్‌కు వచ్చే బ్రిటన్‌వాసులు తప్పనిసరిగా పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని నిబంధన విధించింది. వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ సర్టిఫికేట్ ఉన్నవారినే దేశంలోకి అనుమతిస్తామని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి ఇండియాకు వచ్చే బ్రిటన్ పౌరులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రయాణానికి 72 గంటల ముందు, ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత, 8వ రోజున ఆర్టీ-పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది. భారత్ తాజా నిర్ణయంపై బ్రిటన్ స్పందించింది. భారత ప్రయాణికులకు నిబంధనలను సరళతరం చేస్తామని పేర్కొన్నది.