Coronavirus in India: దేశంలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న టీకా డ్రైవ్‌, తాజాగా 154 రోజుల తర్వాత అత్యంత తక్కువగా 25,166 కేసులు నమోదు, గత 24గంటల్లో 88.13లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ

154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు (Lowest in 154 Days) రికార్డయ్యాయని పేర్కొంది.

Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, August 17: దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు (Coronavirus in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు (Lowest in 154 Days) రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది (Covid Deaths) మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,22,50,679కు పెరిగింది. ఇందులో 3,14,48,754 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,32,079 మంది ప్రాణాలు వదిలారు.

ప్రస్తుతం దేశంలో 3,69,846కి తగ్గి.. 146 రోజుల కష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. దేశంలో రికవరీ 97.51 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 1.98శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.61శాతంగా ఉందని తెలిపింది. గత 24గంటల్లో 88.13లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒకే రోజు ఇదేస్థాయిలో టీకాలు వేయడం తొలిసారని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 55.47పైగా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 49.66 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు తెలిపింది.

గుడ్ న్యూస్..ఏపీలో 10 జిల్లాల్లో అత్యంత తక్కువగా కరోనా పాజిటివిటీ రేటు, తాజాగా 909 మందికి కోవిడ్, 1,543 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి, రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 యాక్టివ్ కేసులు

దేశంలో టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతున్నది. సోమవారం రికార్డు స్థాయిలో 88.13 లక్షల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకే రోజు 18-44 ఏజ్‌గ్రూప్‌లో 31,44,650 మందికి తొలి, 5,22,629 మందికి సెకండ్‌ డోసు అందజేసినట్లు చెప్పింది. మూడో దశ టీకా డ్రైవ్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18-44 ఏళ్ల మధ్య 20,00,68,334 మంది మొదటి.. మరో 1,59,35,853 మంది రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్‌పై భారతదేశ పోరాటాన్ని బలోపేతం చేద్దామని.. టీకా వేయించుకుందాం’ అని ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవ్య ట్వీట్‌ చేశారు. మొత్తం 55,85,834 టీకా మోతాదులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.