Corona in AP: గుడ్ న్యూస్..ఏపీలో 10 జిల్లాల్లో అత్యంత తక్కువగా కరోనా పాజిటివిటీ రేటు, తాజాగా 909 మందికి కోవిడ్, 1,543 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి, రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 యాక్టివ్ కేసులు
Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, August 16: ఏపీలో గడిచిన 24 గంటల్లో 46,962 నమూనాలను పరీక్షించగా 909 మందికి పాజిటివ్‌గా (Covid-19 cases) నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,94,606కి (Andhra Pradesh Covid Cases) చేరింది. తాజాగా 13 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,660కి పెరిగింది.

మరోవైపు 1,543 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,57,08,411 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరులో ముగ్గురు, గుంటూరు, కృష్ణ, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్‌ (Coronavirus Third Wave) వస్తోందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా నియంత్రణలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా అందులో 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తేలింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 5.74 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. కొన్ని జిల్లాల్లో అయితే ఒకటి కంటే తక్కువకు పాజిటివిటీ రేటు పడిపోయింది. గడిచిన వారం రోజుల్లో అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4.68 లక్షల టెస్టులు చేయగా, 2.43 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.

టీచర్‌ కమ్ స్టూడెంట్‌గా మారిన ఏపీ సీఎం వైయస్ జగన్, గ్రీన్‌ బోర్డుపై ఆల్‌ ద వెరీ బె​స్ట్‌ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి, స్కూల్లో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి స్వయంగా తెలుసుకున్న సీఎం

ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని అధికారులు వెల్లడిస్తున్నారు. పెద్ద జిల్లాల్లో ఒకటైన కర్నూలులో పాజిటివిటీ రేటు కేవలం 0.26 శాతంగా నమోదైంది. ఏ జిల్లాలోనూ అసాధారణంగా పాజిటివ్‌ కేసులు పెరిగిన దాఖలాలు లేవు. గడిచిన కొద్ది వారాలుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. మాస్కులు విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి మూడు పనులు చేస్తే పూర్తిస్థాయిలో కరోనాను నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.