India Coronavirus: దేశంలో 4 నెలల తరువాత తక్కువ కేసులు, తాజాగా 29,163 మందికి కోవిడ్, 82,90,370 మంది డిశ్చార్జి, 449 మంది మృతితో 1,30,519కు చేరుకున్న మరణాల సంఖ్య
గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో 30 వేల లోపు కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజు 449 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88.74,290కు చేరాయి.
New Delhi, November 17: భారత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య (India Coronavirus) తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో 30 వేల లోపు కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజు 449 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88.74,290కు చేరాయి. మరణాల సంఖ్య 1,30,519కు చేరాయి. ప్రస్తుతం 4,53,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం దేశంలో 40,791 మంది కోలుకోగా ఇప్పటి వరకు 82,90,370 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో 93 శాతం రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 1.47గా ఉంది. ఇక యాక్టివ్ కేసుల శాతం 5.11గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే (సోమవారం) 95 మరణాలు సంభవించాయి. కేసులలో మరణాల శాతం 21.84 గా నమోదయింది. దేశంలో కరోనా వ్యాప్తి, కోలుకోవడంలో రాజధాని రెండో స్థానంలో నిలిచింది. కేసులు అదుపులోనికి రావడానికి ప్రధాన కారణం టెస్టులు చేసి పాజిటివ్‌లను గుర్తించడంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సోమవారం నాటి నివేదికల ప్రకారం రాష్ర్గ కేంద్ర పాలిత ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో ఢిల్లీ తరువాత కేరళలో 6,684 ,బెంగాల్‌లో 4,480 కోవిడ్ బాధితులు కోలుకున్నారు. అయితే ఈ మూడు ప్రాంతాలలో 76.63 శాతం కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ తరువాత బెంగాల్, కేరళలో కేసుల నమోదులో మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తం మరణాలో ఢిల్లీ ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ తరువాత వరుసగా అత్యధిక మరణాలు మహారాష్ట్ర 60,పశ్చిమ బెంగాల్ 51,పంజాబ్ 30,కేరళ కర్ణాటక లో చెరో 21,ఉత్తర్ ప్రదేశ్ 18,ఒడిషాలో 17 నమోదు అయ్యాయి. దేశంలోని మరణాల్లో 79 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.