Coronavirus in India: కేరళలో థర్డ్ వేవ్ భయం, కఠిన ఆంక్షలు అమలు, దేశంలో తాజాగా 30,256 కరోనా కేసులు నమోదు, గత 24 గంటలలో 295 మంది మృతి

గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 3,34,78,419 కి చేరినట్లు వెల్లడించింది.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

New Delhi, September 20: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 3,34,78,419 కి చేరినట్లు వెల్లడించింది.

ఈ మహమ్మారి బారినపడి గత 24 గంటలలో 295 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 4,45,133 కి చేరింది. కరోనా నుంచి తాజాగా, 43,938 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,18,181 కేసులు (Active Cases Decline to 3,18,181) యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వి పి జాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వీక్లీ ఇన్ఫెక్షన్ పాపులేషన్ రేషియో(డబ్ల్యుఐపీఆర్) 10శాతం కన్నా అధికంగా ఉన్న జిల్లాల్లో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నామని తెలిపారు.

చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, విశ్వరూపం చూపిస్తున్న డెల్టా వేరియంట్, ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లోకి

గడచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 19,653 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 152 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,08,493కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 23,591కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.