India Coronavirus: దేశంలో గత 24 గంటల్లో 30,548 మందికి కరోనా, 88,45,127 కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య, 435 మంది మృతితో 1,30,070 కి చేరుకున్న మరణాల సంఖ్య

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,45,127 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,851 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 435 మంది కరోనా (Coronavirus) కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,070 కి (Coronavirus Deaths) పెరిగింది.

Plasma Therapy in India for Coronavirus (Photo Credits: PTI)

New Delhi, Nov 16: దేశంలో గత 24 గంటల్లో 30,548 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,45,127 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,851 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 435 మంది కరోనా (Coronavirus) కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,070 కి (Coronavirus Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,49,579 మంది కోలుకున్నారు. 4,65,478 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు కరోనా కేసులపై రిపోర్ట్ విడుదల చేసింది.

వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ఇండియా ముందుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఇప్పటికే 20 రకాల వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అందులో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)-భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయన్నారు.

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ,  ఏడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీయూ అధినేత, డిప్యూటీ సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్

బ్రిక్స్‌ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం వ్యాక్సిన్‌ పరిశోధనకు భారత ప్రభుత్వం రూ.894 కోట్లను కేటాయించిందన్నారు. కాగా, సంపన్న దేశాల భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులకోసం అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకోవడంతో పేద దేశాలకు వ్యాక్సిన్‌ అందడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పలు పేదదేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ 2024 వరకు కొనసాగే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బిరెన్‌ సింగ్‌కు‌ కరోనా

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బిరెన్‌ సింగ్‌కు‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తెలింది‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో ఆదివారం ప్రకటించారు. దీంతో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించారు. ‘ఫ్రెండ్స్‌ నాకు కరోనా పాజిటివ్‌గా తెలింది. కొన్ని రోజులుగా నేను కరోనా లక్షణాలతో బాధపడుతున్న. ఈ నేపథ్యంలో ఆదివారం కోవిడ్‌ పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌ వచ్చింది.

కావున ఇటీవల నన్ను కలిసి వారంతా కోవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి’ అంటూ సీఎం తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కరోనా మృతి కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 213కు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ తాజా హల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది.