Coronavirus Outbreak in India: దేశంలో కొత్తగా 3,417 మంది కరోనాతో మృతి, అదే సమయంలో 3,00,732 మంది డిశ్చార్జ్, తాజాగా 3,68,147 మందికి కోవిడ్ నిర్థారణ, లాక్‌డౌన్ ఆంక్షలతో ముంబైలో కేసులు తగ్గుముఖం

వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,00,732 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,99,25,604కు చేరింది.

Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, May 3: భార‌త్‌లో నిన్న‌ కొత్త‌గా 3,68,147 మందికి కరోనా నిర్ధారణ (India Coronaviurs) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,00,732 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,99,25,604కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,417 మంది కరోనా కారణంగా మృతి (Covid deaths in India) చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,18,959కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,93,003 మంది కోలుకున్నారు. 34,13,642 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,71,98,207 మందికి వ్యాక్సిన్లు వేశారు.

గత కొన్ని వారాలుగా కరోనా కల్లోలంతో అల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబై, కాస్తంత ఊపిరి పీల్చుకుంది. నగరంలో లాక్ డౌన్ ను (Mumbai Lockdown) కఠినంగా అమలు చేస్తుండటంతో, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆదివారం నాడు ముంబైలో కొత్తగా 3,629 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో 73 మంది మహమ్మారి కారణంగా కన్నుమూశారు.

దీదీ దెబ్బకు మూడు పార్టీలు అవుట్, బెంగాల్లో కనుమరుగైన కాంగ్రెస్, వామపక్షాలు, మోదీ షా ద్వయానికి పశ్చిమ బెంగాల్లో చుక్కెదురు, ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ హ్యాట్రిక్

ఇప్పటివరకూ ముంబైలో 6.55 లక్షల మందికి పైగా కరోనా (Covid) సోకగా, 13 వేల మందికి పైగా మరణించారు. మొత్తం మహారాష్ట్రలో 47.22 లక్షలకు పైగా కేసులు రాగా, 70 వేల మందికి పైగా మరణించారు. ఇక, ఆదివారం నాడు కరోనా నుంచి 51,356 మంది కోలుకోవడంతో, ఆసుపత్రుల్లో సైతం వేలాది బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. రికవరీ రేటు 84.31 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో 6.68 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇక, కరోనా టీకాలను ప్రస్తుతానికి 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న వారికే ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్న బీఎంసీ అధికారులు, 45 ఏళ్లు పైబడిన వారు టీకాల కోసం రావద్దని సూచించారు. నగరంలో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉందని, టీకాలు సరఫరా కాగానే, మరింత మందికి ఇస్తామని స్పష్టం చేశారు.