COVID-19 in India: దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు, తాజాగా 41,100 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు, 447మంది మృతితో 1,29,635కి చేరిన మరణాల సంఖ్య
గడిచిన 24 గంటల్లో 41,100 కరోనా పాజిటివ్ కేసులు ( 2020 Coronavirus Pandemic in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 88,14,579కి (Coronavirus Cases in India) చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
New Delhi, November 15: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 41,100 కరోనా పాజిటివ్ కేసులు ( 2020 Coronavirus Pandemic in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 88,14,579కి (Coronavirus Cases in India) చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా మొత్తం 447మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో కరోనా వైరస్ కారణంగా దేశంలో మొత్తం మృతి చెందిన బాధితుల సంఖ్య 1,29,635కి చేరింది. గడిచిన 24గంటలలో దేశవ్యాప్తంగా కోవిడ్‌లో వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 42,156గా ఉంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా చికిత్స పొంది 82,05,728 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,79,216గా ఉంది. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 93.09 శాతంగా నమోదైంది. దేశంలో నమోదయిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 5.44గా ఉంది. అదే విధంగా దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.47 శాతానికి తగ్గినట్లు హెల్త్ బులిటెన్ వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జైల్లో 34 మంది ఖైదీలకు కరోనా సోకింది. మహోబా జైలు అధికారులే ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆ జైల్లోని రెండు బ్యారక్‌లను కొవిడ్-19 ఆస్పత్రిగా మార్చినట్టు మహోబా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ కుమార్ సిన్హా తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు అందిన రిపోర్టుల ప్రకారం జైల్లోని 34 మంది విచారణ ఖైదీలు కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు గుర్తించామని ఆయన చెప్పారు. కాగా, మహోబా జిల్లాలో 9 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,094 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం మరో 135 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు.
దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి, బాధితులకు పడకల ఏర్పాటు గురించి చర్చించేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోనున్నారని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యంగా బాధితుల సంఖ్య అధికమైన పక్షంలో ప్రభుత్వ ఆసుపత్రులలో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అమిత్‌షాతో కేజ్రీవాల్ చర్చించనున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో కరోనా కేసులను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టనున్నారని సమాచారం. ఈ విషయమై కూడా అమిత్ షాతో ఢిల్లీ సీఎం చర్చించనున్నారు. కాగా ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతున్న కాలుష్యం కరోనా కేసులు విజృంభణకు దారితీస్తోంది.