COVID-19 in India: దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు, కొత్తగా 41,831 మందికి కోవిడ్, 24 గంటల్లో 541 మంది కరోనా బాధితులు మృతి, 47 కోట్ల మైలురాయిని దాటిన కోవిడ్ వ్యాక్సిన్ సంఖ్య
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in India, India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్ బాధితులు మృతి (Coronavirus deaths in india) చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,24,351.మంది ప్రాణాలు కోల్పోయారు.
New Delhi, August 1: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ మెల్లిగా పెరుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in India, India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్ బాధితులు మృతి (Coronavirus deaths in india) చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,24,351.మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాకుండా గత 24 గంటల్లో 39,258 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,08,20,521 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,10,952 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3.16 కోట్ల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 47,02,98,596 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ భారత్‌లో సెప్టెంబరు నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి కానున్నదని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతోపాటు ఐదు కంపెనీలు సంయుక్తంగా స్పుత్నిక్ -వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నాయని, తద్వారా భారత్ ప్రముఖ టీకా ఉత్పాదక కేంద్రంగా మారనున్నదని ఆర్డీఐఎఫ్ పేర్కొంది. ఇదేవిధంగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సెకెండ్ బ్యాచ్ ఉత్పత్తిలో జాప్యం జరగబోదని తెలిపింది.
భారత్‌లోని భాగస్వామ్య కంపెనీల సాయంలో సెకెండ్ బ్యాచ్ ఉత్పత్తి జరగనున్నదని పేర్కొంది. ఇందుకు సంబంధించి రష్యా, భారత్ లోని వ్యాక్సీన్ ఉత్పాదక కంపెనీల మధ్య ఒప్పందపు సంతకాల ప్రక్రియ జరగనున్నదని తెలిపింది. దీనితోపాటు ఆగస్టు నుంచి భారత్‌లో స్పుత్నిక్-వీ తోపాటు స్పుత్నిక్ లైట్ వ్యాక్సీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని ఆర్డీఐఎఫ్ పేర్కొంది.