IPL Auction 2025 Live

India Coronavirus: ఒక్కడు 119 మందికి కరోనాని అంటించాడు, దేశంలో 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, కరోనా నుంచి కోలుకున్న 96 ఏళ్ల బామ్మ, 21,604కు చేరిన మరణాల సంఖ్య

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,76,685 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్‌ బారినవారిలో 4,95,513 మంది కోలుకున్నారు. ఈ వైరస్‌ వల్ల గత 24 గంటల్లో 475 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,604కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, July 10: దేశంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,506 కరోనా పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,76,685 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్‌ బారినవారిలో 4,95,513 మంది కోలుకున్నారు. ఈ వైరస్‌ వల్ల గత 24 గంటల్లో 475 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,604కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌, దూబే ఆస్తులపై దిమ్మతిరిగే వాస్తవాలు, ఎన్‌కౌంటర్‌పై పోలీసులు ఏమంటున్నారు, కరడుగట్టిన క్రిమినెల్ మృతి ఎపిసోడ్‌పై కీలక విషయాలు మీకోసం

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 2,30,599 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 9667 మంది మరణించారు. తమిళనాడులో 1,26,581 మంది కరోనా బారినపడగా, 1,765 మంది బాధితులు మృతిచెందారు. దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 1,07,051 కేసులు నమోదవగా, 3258 మంది చనిపోయారు. 39194 పాజిటివ్‌ కేసులతో (COVID-19 Cases) గుజరాత్‌, 32,362 కరోనా కేసులతో ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడులకు తలుపులు తెరిచాం, భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

కేరళలోని పుంథూరా గ్రామంలో ఓ చేపల వ్యాపారికి కరోనా సోకింది. దీంతో అతడి దగ్గర చేపలు కొన్న వారికి, కలిసిన వారికి టెస్ట్ చేయగా 119 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరికొంత మంది పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ వ్యాపారి తమిళనాడులోని ఓ స్థానిక మార్కెట్లో చేపలు విక్రయిస్తుంటాడని తెలిసింది. పుంథూరా సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇక్కడ నివసిస్తున్న చాలా కుటుంబాలు చేపలు వేటాడి జీవనాధారం సాగిస్తుంటారు. చేపల విక్రయదారుడికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిని కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా మత్స్య కారులను ఆదేశించారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉందని అన్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ దేశాల్లో కరోనా లేనే లేదు, ప్ర‌పంచ వ్యాప్తంగా 12 మిలియ‌న్ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు, కరోనాతో విలవిలలాడుతున్న అమెరికా, రష్యా, బ్రెజిల్, భారత్

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన 96 ఏళ్ల బామ్మ కరోనాపై పోరాడి గెలిచింది. మొదటి నుంచి చక్కటి ఆరోగ్యంతో ఉండటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడడం, అన్నింటికీ మించి మానసిక స్థైర్యం కోల్పోకపోవడం ఆమెను కరోనాపై గెలిపించాయి. జూన్‌ 25న హిరియూరులోని కిరాణా దు కాణం నిర్వహకుడికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అతని తల్లి(96), భార్య, కుమారుడు, మరో బంధువుకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా వైరస్‌ సోకినట్టు తేలింది. జిల్లా కొవిడ్‌ చికిత్సా కేంద్రంలో చికిత్స పొందిన వీరంతా గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు.

దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ మొత్తం యాక్టివ్ కేసుల‌లో కేవ‌లం ఎనిమిది రాష్ట్రాల నుంచే 90 శాతం ఉన్నాయి. కేవ‌లం 49 జిల్లాల్లోనే 80 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కేవ‌లం ఆరు రాష్ట్రాల నుంచే 86 శాతం క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 80 శాతం క‌రోనా మ‌ర‌ణాలు 32 జిల్లాల్లోనే న‌మోద‌య్యాయి. మొత్తం క‌రోనా యాక్టివ్ కేసుల‌లో మ‌హారాష్ట్ర‌, తమిళ‌నాడు, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లోనే 90 శాతం ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లోనే 86 శాతం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా (Coronavirus Cases in Maharashtra) మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ ఓ 20 ఏండ్ల యువ‌కుడు చికిత్స కోసం ముంబైలోని కింగ్ ఎడ్వ‌ర్డ్ మెమోరియ‌ల్ ఆస్ప‌త్రిలో చేరాడు. దాదాపు 15 రోజులు చికిత్స అనంత‌రం అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. క‌రోనా ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చింది. కానీ ర‌క్త ప‌రీక్ష‌ల్లో బ్ల‌డ్ క్యాన్స‌ర్ అని తేలింది. దీంతో ఆ యువ‌కుడు ఆస్ప‌త్రి గ‌దిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.