COVID-19 in India: గుడ్ న్యూస్..జంతువులపై సత్ఫలితాలను ఇస్తున్న కోవాగ్జిన్ టీకా, దేశంలో తాజాగా 92,071 మందికి కరోనా, 48,46,428కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసులు
దీంతో కొవిడ్ పాజిటివ్ కేసులు 48లక్షల మార్క్‌ను దాటింది. దేశంలో కేసుల సంఖ్య 48,46,428కు చేరాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్ కేసులు (COVID-19 in India) ఉన్నాయని, 37,80,108 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది.
New Delhi, September 14: దేశంలో గడిచిన 24 గంటల్లో 92,071 పాజిటివ్ కేసులు (2020 Coronavirus Pandemic in India) నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్ కేసులు 48లక్షల మార్క్‌ను దాటింది. దేశంలో కేసుల సంఖ్య 48,46,428కు చేరాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్ కేసులు (COVID-19 in India) ఉన్నాయని, 37,80,108 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది.
వైరస్ ప్రభావంతో గడిచిన 24గంటల్లో మరో 1,136 మంది మరణించగా.. ఇప్పటి వరకు 79,722 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారని వివరించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం 9,78,500 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు 5,72,39,428 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.
కరోనా కేసుల్లో ఇప్పటికే భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఆగస్టు నెల మధ్య నుంచి అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇక కోవిడ్‌కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు జనాలంతా జాగ్రత్తలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే.
ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నేటి నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోతులపై జరిపిన ప్రయోగాల్లో వాటి శరీరాల్లో బలమైన వ్యాధినిరోధకత కనిపించినట్లు తెలిపింది. దీనివల్ల ప్రైమేట్ జీవుల్లో వ్యాధి నిరోధకత పెంచే విషయంలో అంచనాలు మరింత మెరుగయ్యాయని తెలిపింది. ప్రయోగాల కోసం 20 రీసస్ కోతులను నాలుగు గ్రూపులుగా విభజించామని, వీటిలో ఒక గ్రూప్ కోతులకు ప్లాసిబో(ఎటువంటి ఔషధం లేని డోసు)ను ఇచ్చామని, మిగిలిన గ్రూపుల్లో కోతులకు మూడు రకాల వ్యాక్సిన్స్‌ను ఇచ్చామని వివరించింది.
14 రోజుల అనంతరం అన్ని కోతులను వైరస్‌కు గురిచేశామని, అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో ఐజీ–జి యాంటీబాడీలు పెరిగి, గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను తగ్గించినట్లు తెలిసిందని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో న్యుమోనియా లక్షణాలు కనిపించలేదంది. టీకా ఇచ్చిన కోతుల్లో భారీ సైడ్‌ఎఫెక్ట్‌లు కానరాలేదని తెలిపింది.